Srirangam Temple: భరతనాట్య నృత్యకళాకారుడు జాకీర్‌ హుస్సేన్‌కు అవమానం.. శ్రీరంగనాథస్వామి ఆలయ ప్రవేశం నిరాకరణ..!

Srirangam Temple: ప్రముఖ ప్రఖ్యాత భరతనాట్య కళాకారుడు జాకీర్‌ హుస్సేన్‌కు అవమానం జరిగింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో జాకీర్‌ హుస్సేన్‌ శ్రీరంగనాథ స్వామి..

Srirangam Temple: భరతనాట్య నృత్యకళాకారుడు జాకీర్‌ హుస్సేన్‌కు అవమానం.. శ్రీరంగనాథస్వామి ఆలయ ప్రవేశం నిరాకరణ..!

Updated on: Dec 14, 2021 | 7:19 AM

Srirangam Temple: ప్రముఖ ప్రఖ్యాత భరతనాట్య కళాకారుడు జాకీర్‌ హుస్సేన్‌కు అవమానం జరిగింది. తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో జాకీర్‌ హుస్సేన్‌ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రవేశించారు. ఆయన ప్రవేశాన్ని నరసింహా అనే వ్యక్తి అడ్డుకున్నారు. దీంతో జాకీర్‌ను అడ్డుకున్న ఘటనపై పలువురు రంగరాజన్ నరసింహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జాకీర్‌ హుస్సేన్‌ గతంలో పలుమార్లు ఆలయాన్ని సందర్శించారని, డిసెంబర్‌ 10న ఆలయానికి వచ్చాడని శ్రీరంగ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ఆయన ఆలయంలోకి వస్తుండగా రంగరాజన్‌ నరసింహా అనే వ్యక్తి అడ్డుకున్నాడు. అడ్డుకోవడమే కాకుండా జాకీర్‌ హుస్సేన్‌పై నరసింహన్‌ పలు దుర్భాషలాడినట్లు హుస్సేన్ ఆరోపించారు. ఈ విషయాన్ని హుస్సేన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకున్నారు. అలాగే తనకు అధిక రక్తపోటు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టులను సైతం జాకీర్‌ హుస్సేన్‌ సోషల్‌ మీడియా ద్వారా చూపించాడు.

మరో వైపు జాకీర్‌ హుస్సేన్‌ను అడ్డుకున్న విషయాన్ని రంగరాజన్‌ నరసింహన్‌ ట్విట్టర్‌ వేదికగా తన చర్యలను సమర్థించుకున్నారు. జాకీర్‌ హుస్సేన్‌ పుట్టుకతో ముస్లిం, తన ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌లో సనాతన ధర్మలను విమర్శించే వ్యక్తి.. అలాంటి వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించడం అడ్డుకున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. ఆలయంలో హిందువులకు మాత్రమే అనుమతి ఉంది అంటూ ఏర్పాటు చేసిన బోర్డును సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. జాకీర్‌ హుస్సేన్‌కు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డును అందుకున్నారు. ఆయనను అడ్డుకోవడంపై పలువురు ఖండిస్తున్నారు. అయితే ఈ విషయమై విచారణ ప్రారంభించామని, తదుపరి శాఖ పరమైన చర్యలు ఉంటాయని హిందు మత, ధర్మదాయ శాఖ మంత్రి శేఖర్‌ బాబు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిన నివేదిక అందించాలని శ్రీరంగ ఆలయ జాయింట్‌ కమిషనర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిజమైతే అడ్డుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి:

PM Modi: విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు నిర్మాణ కార్మికులకు అరుదైన గౌరవం.. వారితో కలిసి భోజనం చేసిన ప్రధాని మోడీ..

BMW Electric Car: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనం.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర, ఇతర వివరాలు