Bharat Bandh Tomorrow: రేపు భారత్ బంద్.. జగన్ సర్కార్ సంపూర్ణ మద్దతు.. వాటికి మాత్రమే మినహాయింపు.!

| Edited By: Team Veegam

Mar 25, 2021 | 7:00 PM

Bharat Bandh Tomorrow: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 26వ తేదీన భారత్ బంద్‌కు తలపెట్టిన..

Bharat Bandh Tomorrow: రేపు భారత్ బంద్.. జగన్ సర్కార్ సంపూర్ణ మద్దతు.. వాటికి మాత్రమే మినహాయింపు.!
Bharat Bandh
Follow us on

Bharat Bandh Tomorrow: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 26వ తేదీన భారత్ బంద్‌కు తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌ను దేశ పౌరులంతా కలిసి పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే మార్చి 26వ తేదీన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉండనుంది.

ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రహదారులు క్లోజ్ కానున్నాయి. అటు ప్రజా రవాణా అంతా బంద్ కానుంది. అలాగే మార్కెట్లు, జనసాంద్రిత ప్రదేశాలను సైతం మూసివేయనున్నారు. “అన్నదాతలను గౌరవించి.. ఈ భారత్ బంద్ విజయవంతం అయ్యేలా చూడాలని దేశ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం” అని రైతు సంఘం నాయకుడు దర్శన్ పాల్ పేర్కొన్నారు.

భారత్ బంద్‌కు వైసీపీ మద్దతు..

రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ ‌బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ కానున్నట్లు స్పష్టం చేశారు. అయితే బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా, భారత్ బంద్‌కు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు తెలపాయి.

Also Read: కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!