Bharat Bandh: బ్యాంకులు యధావిధి.. బస్సులు, ట్రైన్స్ కొంచెం ఆలస్యం.. బంద్ పూర్తి వివరాలివిగో

ఇవాళ భారత్ బంద్‌కి 10 కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త సమ్మెలో రైతులు సహా 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భారత్ బంద్‌లో INTUC,AITUC,HMS,CITU,AITUC,TUCC,SEWA,AICCTU,LPF,UTUC కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. భారత్ బంద్‌కి మద్దతిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా,వ్యవసాయ కార్మిక సంఘాలు..

Bharat Bandh: బ్యాంకులు యధావిధి.. బస్సులు, ట్రైన్స్ కొంచెం ఆలస్యం.. బంద్ పూర్తి వివరాలివిగో
Bharat Bandh

Updated on: Jul 09, 2025 | 7:26 AM

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు(జూలై 9న) బంద్ పాటిస్తున్నాయి. ఈ సమ్మెలో రైతులతో సహా 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఈ బంద్ ప్రభావం పరిశ్రమలు, పోస్టల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండనుంది. కార్మిక సంఘాల 17 డిమాండ్లను కేంద్రం ముందుంచి ఏడాది పూర్తయినా కేంద్రం స్పందించకపోవడంతో ఈ సార్వత్రిక సమ్మెను చేపడుతున్నాయ్ కార్మిక సంఘాలు. ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని, కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నాయ్. కార్మికుల ప్రయోజనాలు బలహీనపరిచేందుకు, యూనియన్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి వ్యాపారం చేయడంలో సౌలభ్యం పేరుతో యజమానులకు అనుకూలంగా నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను అమలు చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయ్.

ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ఉద్యోగుల వేతనాలు తగ్గుతున్నాయని, విద్య, ఆరోగ్యం, ప్రాథమిక పౌర సౌకర్యాలలో సామాజిక రంగ వ్యయంలో కోత ఏర్పడిందని, ఇవన్నీ పేదలు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు అసమానతలు, కష్టాలకు దారితీస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టి విదేశీ, భారతీయ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయ్.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అవుట్‌సోర్సింగ్ విధానాలు, కాంట్రాక్టరైజేషన్, శ్రామిక శక్తిని క్యాజువలైజేషన్ చేయడం వంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. గతంలోనూ 2020 నవంబర్ 26న, 2022 మార్చి 28-29, గతేడాది ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలను కార్మిక సంఘాలు నిర్వహించాయి. కాగా, ఇవాళ సహకార బ్యాంకులు పనిచేయకపోయినా ప్రైవేట్ బ్యాంకులు పని చేయవచ్చు. విద్యాసంస్థలు, ప్రైవేట్ ఆఫీసులు యధావిధిగా నడిచే అవకాశం ఉంది. రవాణా విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అటు విద్యుత్ రంగ అధికారులు సుమారు 27 లక్షల మంది ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. అలాగే రైల్వేస్ విషయంలోనూ.. ట్రైన్స్ కాస్త ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది.

ఇది చదవండి: పెరట్లోని కొబ్బరి చెట్టుపై ఏదో నల్లటి ఆకారం.. టార్చ్ వేసి చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..