Infant Trafficking: కడుపు రగిలిపోయే నేరాలు.. ఆరేళ్లలో 250పైగా నవజాత శిశువుల విక్రయం

|

Dec 01, 2023 | 7:46 AM

పిల్లల అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఆరేళ్లలో సుమారు 250 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సంతానం లేని వారిని గుర్తించి, నవజాత శిశువులను విక్రయించడమే వీరి కర్తవ్యం. అలా విక్రయిస్తూ ప్రధాన నిందితురాలు దొరికిపోయింది. ఈ కేసు విచారణను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు మహాలక్ష్మి ఈ ఆరేళ్లలో 250 మంది శిశువులను విక్రయించిందని ప్రాథమికంగా గుర్తించారు..

Infant Trafficking: కడుపు రగిలిపోయే నేరాలు.. ఆరేళ్లలో 250పైగా నవజాత శిశువుల విక్రయం
Infant Trafficking
Follow us on

బెంగళూరు, డిసెంబర్‌ 1: పిల్లల అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఆరేళ్లలో సుమారు 250 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సంతానం లేని వారిని గుర్తించి, నవజాత శిశువులను విక్రయించడమే వీరి కర్తవ్యం. అలా విక్రయిస్తూ ప్రధాన నిందితురాలు దొరికిపోయింది. ఈ కేసు విచారణను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు మహాలక్ష్మి ఈ ఆరేళ్లలో 250 మంది శిశువులను విక్రయించిందని ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో కర్ణాటకలో 60 మందిని తన గ్యాంగుతో కలిసి విక్రయించిందని పోలీసులు తెలిపారు. ఆరేళ్లలో 250 మందికి పైగా పిల్లలను విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. ఇందులో 50-60 మంది శిశువులను కర్ణాటకలో విక్రయించగా, మిగిలిన శిశువులను తమిళనాడులో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో కేవలం 10 మంది పిల్లల ఆచూకీని సీసీబీ పోలీసులు గుర్తించగలిగారు. మిగిలిన పిల్లల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఆర్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల పసికందును విక్రయించేందుకు ప్రయత్నించగా ఏడుగురు నిందితులు కన్నన్ రామస్వామి, హేమలత, మహాలక్ష్మి, శరణ్య, సాహసిని, రాధ, గోమతిలను నవంబర్ 28న అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం నవంబర్ 29న మరో నిందితుడు మురుగేశ్వరి, కెవిన్ అనే నకిలీ వైద్యుడు, మధ్యవర్తి రమ్యను అరెస్టు చేశారు. నిందితులు కొన్నేళ్లుగా పసికందులను దొంగిలించి కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

ప్రధాన నిందితురాలు మహాలక్ష్మి 2015-17 మధ్యలో దుస్తుల పరిశ్రమలో పని చేసేది. వేతనంగా నెలకు రూ.8 వేలు పొందేది. ఆ సమయంలో ఒక మహిళ మహాలక్ష్మికి పరిచయం అయ్యింది. అండాన్ని ఇస్తే రూ.20 వేలు ఇస్తానని కోరింది. ఆ విధంగా తొలి సంపాదనతో అత్యాశ కలిగిన మహాలక్ష్మి ఆరోగ్యంగా ఉన్న యువతులను గుర్తించి, వారికి కొంత నగదు ఇచ్చి, అండాలను విక్రయిచుకుంటూ సొమ్ము చేసుకునేది. ఇదే క్రమంలో ఆడపిల్ల పుట్టిందని, ఆ బిడ్డ తమకు వద్దనుకునే వారికి కొంత సొమ్మ ముట్టజెప్పి సంతానం లేని దంపతులకు ఆ బిడ్డను విక్రయించేది. వివాహేతర సంబంధం, పెళ్లికాకుండా గర్భవతి అయిన యువతులను డబ్బు ముట్ట జెప్పి, కాన్పు తర్వాత బిడ్డలను విక్రయించుకునే ప్రక్రియ జోరుగా సాగించింది. ఇతరులకు అనుమానం రాకుండా తన ఇంటికి సమీపంలో కూరగాయల విక్రయాల దుకాణాన్ని పెట్టుకుంది. అక్కడకు వచ్చే యువతులు, గృహిణిలతో మాట కలిపి తప్పు చేయకుండా డబ్బు సంపాదించవచ్చని నమ్మిస్తూ అండాల విక్రయ వ్యాపారం సాగించేది. ఇతర నిందితుల వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.