Viral: పోలీసులు ఆపగానే కారు వదిలేసి ఎస్కేప్‌కు యత్నం.. పట్టుకుని వాహనంలో చెక్ చేయగా.. నికార్సయిన

తగ్గేదే లే... పుష్పలో అల్లు అర్జున్ మాదిరి రెచ్చిపోతున్నారు స్మగ్లర్స్. దర్జాగా కారులోనే అరుదైన కలప అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు.

Viral: పోలీసులు ఆపగానే కారు వదిలేసి ఎస్కేప్‌కు యత్నం.. పట్టుకుని వాహనంలో చెక్ చేయగా.. నికార్సయిన
Red Sandalwood
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2022 | 12:07 PM

Bengaluru crime news:  ప్రపంచంలోనే మాంచి క్వాలిటీ ఉన్న ఎర్రచందనం.. కాదు.. కాదు ఎర్ర బంగారం  మన రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇక ఎర్రచందనానికి దేశ, విదేశాల్లో ఎంత మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్ క్రీమ్స్, వయాగ్రా, కాస్మెటిక్స్ లాంటి వాటిలో దీన్ని వాడుతారు. జపాన్‌(Japan), చైనా(China) వంటి దేశాల్లో పాత్రలు ఈ ఉడ్‌తోనే తయారు చేస్తారు. ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువులు పలు అకేషన్స్‌లో గిఫ్టులుగా కూడా ఇస్తారు. దీంతో అక్రమార్కులు మన అరుదైన కలపను దోచేస్తున్నారు. పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌(Allu Arjun) మాదిరి స్కెచ్చులు వేస్తూ బోర్డర్ దాటించేస్తున్నారు. అనువైన అన్ని మార్గాలను ఇందుకు వాడుకుంటున్నారు. పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉంటే.. దుంగలను కొంతకాలం చాలా నాక్‌గా దాచేస్తున్నారు. తాజాగా బెంగళూరులోని కెంగేరిలో పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కారులో తరలిస్తున్న బాగా చేవ ఉన్న 5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తుండగా  పోలీసులకు అనుమానం రావడంతో ఓ కారును ఆపాలని కోరారు. దీంతో ఆ కార్ లోని వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని పట్టుకున్నారు. కార్‌లో చెక్ చేయగా..  105 కిలోల బరువున్న 3.15 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దొరికింది. ఎరుపు రంగు టయోటా కారుకు  ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉందంటేనే ఆ చందనం మన శేషాచలం అడవుల్లో పెరిగింది అని అర్థం అవుతుంది. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..