బెంగాల్ లో పాతికేళ్ల మహిళా డాక్టర్ ఒకరు కోవిద్ బారిన పడి విజయం సాధించింది. కరోనా వైరస్ పాజిటివ్ కి గురై హాస్పిటల్ లో 10 రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉండి కోలుకుంది. మొదటిసారిగా తన బిడ్డను అక్కున చేర్చుకుని మురిసిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. డా.అర్ఫా సజాదిన్ అనే ఈ డాక్టర్ 37 వారాల గర్బంతో ఉండగా పాజిటివ్ కి గురైంది. హౌరా జిల్లాలోని ఆసుపత్రిలో ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు డాక్టర్లు.. అయితే తల్లిని, చిన్నారిని వేరుగా ఉంచక తప్పలేదు. ఆ డాక్టర్ లోని రక్త కణాలు బలహీనంగా ఉండడం వల్ల ..ఇతర రుగ్మతల కారణంగా ఆమెను వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స చేయాల్సి వచ్చింది. చివరకు పూర్తిగా కోలుకోవడంతో ఆమెకు వెంటిలేటర్ తొలగించారు. 10 రోజుల అనంతరం ఆమెకి ఆ బిడ్డను అప్పగించినప్పుడు ఆనందంతో చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. ఆ చిన్నారికి నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. తనకు కోవిద్ సోకినా ఏ మాత్రం అధైర్య పడకుండా ..దానిపై విజయం సాధించినందుకు ఆ మహిళా డాక్టర్ ను అంతా అభినందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.