విపక్ష సమైక్యతే ‘సమర శంఖ’ నినాదం.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్న మమతా బెనర్జీ

2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో విపక్ష సమైక్యతకు నడుం కట్టిన బెంగాల్ సీఎం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. నిన్న ఆమె ప్రధాని మోదీతో బాటు కాంగ్రెస్ నేతలు....

విపక్ష సమైక్యతే సమర శంఖ నినాదం..  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్న మమతా బెనర్జీ
Mamata- Sonia Gandhi

Edited By: Anil kumar poka

Updated on: Jul 28, 2021 | 11:52 AM

2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో విపక్ష సమైక్యతకు నడుం కట్టిన బెంగాల్ సీఎం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. నిన్న ఆమె ప్రధాని మోదీతో బాటు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను షింగ్వి తదితరులను కూడా కలుసుకున్నారు. మోదీతో తాను మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాయని, తమ భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని, తమ రాష్ట్రానికి వ్యాక్సిన్ డోసుల కేటాయింపును పెంచాల్సిందిగా కోరానని ఆమె చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ సమగ్ర ప్రణాళికను రచించడానికి విపక్షాలను ఒక్క తాటిపైకి తేవాల్సి ఉందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆమె సోనియాతో జరుపనున్న భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మీరు ఢిల్లీని సందర్చించి విపక్షాలతో సమావేశమవుతున్నారా అన్న ప్రశ్నకు ఆమె.ప్రతిపక్ష సమైక్యత అన్నది సహజంగా ఏర్పడుతుందని, దాన్ని ఎవరూ ఆపజాలరని పేర్కొన్నారు. ఇది ఆటోమాటిక్ గా సమయం వచ్చినప్పుడు ఏర్పడుతుంది. వచ్చే ఏడాది, యూపీ, పంజాబ్, త్రిపుర వంటి రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది అన్నారు.

ఈ కారణంగానే ముందస్తు కార్యాచరణ అన్నది అవసరమని మమతా బెనర్జీ చెప్పారు. ఈ దేశాన్ని ప్రతిపక్షాలు లీడ్ చేయాల్సి ఉంది. ఇందుకు ఎంతో కసరత్తు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటినుంచే ఇందుకు పూనుకోవలసి ఉందని అన్నారు. సోనియాతో తాను జరపనున్న సమావేశాన్ని కీలకమైనదిగా ఆమె పేర్కొన్నారు.అటు బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి :Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..

 ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ కుప్పంలో పోలీసుల పేరుతో కర్ణాటక దొంగల హల్‌చల్‌..:Kuppam Video.

 బాహుబలి బల్లాల దేవా రేంజ్ లో ఏకాంగా బైక్ నే అమాంతం ఎత్తితే ఎలా ఉంటుంది..ఇదిగో ఇలా ఉంటుంది.(వీడియో):Viral Video.

 మార్చరీ గది నుంచి గురక శబ్దం..! షాక్‌ తిన్న డాక్టర్లు!అరుదైన ఘటన..:Snoring Noise From Mortuary Video.