AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పౌరసత్వ ‘ మంట ‘.. బెంగాల్ లో దీదీ మెగా ర్యాలీ

పౌరసత్వ సవరణ బిల్లు(చట్టం) పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. బెంగాల్ లో అనేక జిల్లాలు నిరసనలతో అట్టుడుతున్న వేళ.. ఆమె చేసిన ఈ ప్రకటన ఆమె పార్టీ సహచరులు, కార్యకర్తలకు, ఆందోళనకారులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. […]

పౌరసత్వ ' మంట '.. బెంగాల్ లో దీదీ మెగా ర్యాలీ
Pardhasaradhi Peri
|

Updated on: Dec 16, 2019 | 3:12 PM

Share

పౌరసత్వ సవరణ బిల్లు(చట్టం) పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. బెంగాల్ లో అనేక జిల్లాలు నిరసనలతో అట్టుడుతున్న వేళ.. ఆమె చేసిన ఈ ప్రకటన ఆమె పార్టీ సహచరులు, కార్యకర్తలకు, ఆందోళనకారులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. పౌరసత్వ చట్టాన్నే కాదు.. ఎన్నార్సీ ని కూడా తమ ప్రభుత్వం అనుమతించబోదని, రాష్ట్రం నుంచి ఏ శరణార్ధినీ తాము తిప్పి పంపబోమని దీదీ పేర్కొన్నారు.’ అన్ని మతాలు, కులాలు కలిసి ఉండాలన్నదే మా అభిమతం.. ఇలా అని మా పార్టీ కార్యకర్తల చేత కూడా ప్రమాణం చేయిస్తున్నాం ‘ అని మమతఅన్నారు. మనమంతా ఈ దేశ పౌరులమని, ఎవరూ మనలను విడదీయజాలరని ఆవేశంగా వ్యాఖ్యానించారు. అటు-ఈ ర్యాలీలో పాల్గొనరాదంటూ గవర్నర్ జగదీప్ ధన్ కర్ చేసిన సూచనను కూడా దీదీ పట్టించుకోలేదు. ఆమె చర్య రాజ్యాంగ విరుధ్ధమని, ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరుతున్నానని గవర్నర్ ట్వీట్ చేశారు. అయితే వీటిని లక్ష్యపెట్టని మమతా బెనర్జీ.. ఈ విధమైన ర్యాలీలు బుధవారం వరకు కొనసాగుతాయని ప్రకటించారు. కాగా-పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఆదివారం ఆందోళనకారులు అయిదు రైళ్లకు నిప్పు పెట్టారు. రోడ్లపై వాహనాలను అడ్డుకున్నారు. పలుచోట్ల టైర్లను కాల్చివేశారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా నిరసనలను ప్రోత్సహించడంతో ఆందోళనకారులను అడ్డుకునేవారే లేకపోయారు.