ఉల్లితో వచ్చిన లక్..ఉన్నఫలంగా కోటీశ్వరుడిగా మారిన రైతు

వ్యవసాయం అంటేనే చాలా రిస్క్‌తో కూడుకున్నది. ప్రతి నిమిషం సాహసంతో చేసే వృత్తి అదే. విత్తు పెట్టిన మొదలు రకరకాల సవాళ్లు రైతులకు ఎదురవుతుంటాయి. కీటకాల భారిన పడటం నుంచి.. అతివృష్టి, అనావృష్టి వంటివి ఏం జరిగినా పంట నాశనం అయిపోతుంది. రేపు పంట కోస్తామనగా, రాత్రికి రాత్రే గాలి దుమ్ము రావడంతో పంట నాశనమై..రోడ్డున పడ్డు రైతుల కథలు ఎన్నెన్నో. అయినా కానీ రైతు వెనక్కి తగ్గడు. ఎందుకంటే ఒకరి కింద బానిసత్వం చేసే వృత్తి […]

ఉల్లితో వచ్చిన లక్..ఉన్నఫలంగా కోటీశ్వరుడిగా మారిన రైతు
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 16, 2019 | 9:51 PM

వ్యవసాయం అంటేనే చాలా రిస్క్‌తో కూడుకున్నది. ప్రతి నిమిషం సాహసంతో చేసే వృత్తి అదే. విత్తు పెట్టిన మొదలు రకరకాల సవాళ్లు రైతులకు ఎదురవుతుంటాయి. కీటకాల భారిన పడటం నుంచి.. అతివృష్టి, అనావృష్టి వంటివి ఏం జరిగినా పంట నాశనం అయిపోతుంది. రేపు పంట కోస్తామనగా, రాత్రికి రాత్రే గాలి దుమ్ము రావడంతో పంట నాశనమై..రోడ్డున పడ్డు రైతుల కథలు ఎన్నెన్నో. అయినా కానీ రైతు వెనక్కి తగ్గడు. ఎందుకంటే ఒకరి కింద బానిసత్వం చేసే వృత్తి కాదు అది. పండించింది తింటాడు, పదిమందికి కడుపు నింపుతాడు. అందుకే వ్యవసాయంలోనే సాయం ఉంది. కానీ వ్యవసాయం ఎంతో కష్టంతో కూడుకుంది.

ఇప్పుడు మీకు ఒక రైతును పరిచయం చేయబోతున్నాం. అతను చేసిన రిస్కు, అందుకు పొందిన ప్రతిఫలం నిజంగా ఆశ్యర్యం కల్గించక మానదు. కర్నాటకలోని చిత్రదుర్గ అనే ఊరిలో మల్లిఖార్జున అనే రైతు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. ఇతడు తనకున్న పది ఎకరాల్లో పంట పండించుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే సాగులో అంత లాభాలు వచ్చేవి కాదు. ఏటికేడు అప్పులు పెరిగాయే తప్ప….సాగు మాత్రం కలిసి రాలేదు. దీంతో వ్యవసాయం మీద విసుగు వచ్చింది. అయితే చివరిసారిగా ప్రయత్నిద్దామని..ఈసారి ఉల్లిపంట వేశాడు. ఉల్లితో వచ్చే ఆదాయమేమీ ఉండదని…అందరూ అన్నారు కానీ మల్లిఖార్జున వారి మాటలు వినకుండా ఉల్లి పంట సాగు చేశాడు. తనకున్న పది ఎకరాలే కాదు..మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 20ఎకరాల్లో ఉల్లిపంట వేశాడు. బ్యాంకులోను, బయట కొంత అప్పు తెచ్చి మొత్తం 15 లక్షలతో పెట్టుబడి పెట్టాడు. అమాంతం ఉల్లి ధరలు పెరగడంతో…మల్లిఖార్జున సుడి తిరిగింది.

20ఎకరాల్లో ఉల్లి వేసిన మల్లిఖార్జునకు ఇప్పుడు కోట్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఉల్లి కిలో ధర 200 దాకా పలుకుతోంది. దీంతో మల్లిఖార్జున ఇప్పటివరకు 240 టన్నులు ఉల్లిని అమ్మాడు. ఈ అమ్మకంతో దాదాపు 4కోట్ల 50లక్షల ఆదాయం వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయి చితికిపోయిన మల్లిఖార్జునకు ఉల్లి రూపంలో అదృష్టం కలిసివచ్చింది. అప్పులు తీరిపోగా…ఇప్పుడు మరో కొత్త ఇల్లు కూడా కొన్నాడు.