Jammu: బారాముల్లా జిల్లాలో దారుణం.. మసీదులో ఆజాన్ ఇవ్వడానికి వెళ్లిన రిటైర్డ్ ఎస్‌ఎస్పీ కాల్చి చంపిన దుండగులు

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. మసీదులో ఆజాన్ ఇవ్వడానికి వెళ్ళిన రిటైర్డ్ ఎస్‌ఎస్పీ కాల్చి చంపారు దుండగులు. కాల్పులు జరిపిన తర్వాత అనుమానిత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. మసీదుపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు

Jammu: బారాముల్లా జిల్లాలో దారుణం.. మసీదులో ఆజాన్ ఇవ్వడానికి వెళ్లిన రిటైర్డ్ ఎస్‌ఎస్పీ కాల్చి చంపిన దుండగులు
Former Ssp Mohammad Shafi Shot Died
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 24, 2023 | 11:34 AM

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. మసీదులో ఆజాన్ ఇవ్వడానికి వెళ్ళిన రిటైర్డ్ ఎస్‌ఎస్పీ కాల్చి చంపారు దుండగులు. కాల్పులు జరిపిన తర్వాత అనుమానిత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. మసీదుపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా ఉగ్రవాదుల పిరికిపంద చర్యలు పెరిగిపోతున్నాయి. పూంచ్‌లో ఆర్మీ వాహనంపై రహస్యంగా దాడి చేసిన తరువాత, ఇప్పుడు రిటైర్డ్ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు.

గంత్ముల, షీరి బారాముల్లా నివాసి మహ్మద్ షఫీపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పదవీ విరమణ చేసిన ఎస్‌ఎస్పీపై బుల్లెట్లు ప్రయోగించారు. మసీదులో ఆజాన్‌ ఇస్తున్న సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. బుల్లెట్ గాయం కారణంగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకుని, ఆ ప్రాంతమంతా చుట్టుముట్టినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

అదే సమయంలో, గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడుల సంఖ్య పెరుగుతోంది. గురువారం, కేంద్ర పాలిత ప్రాంతమైన పూంచ్ జిల్లాలోని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సైట్‌కు ఆర్మీ సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాలపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. ఉగ్రవాదుల ఈ పిరికిపంద చర్యలో ఐదుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదులు సైనికుల ఆయుధాలను కూడా దోచుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాల్లోని సున్నిత ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…