Bank Strike: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె…

|

Dec 17, 2021 | 9:51 AM

Bank Strike: బ్యాంకులను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ బ్యాంకులను..

Bank Strike: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె...
Bank Strike
Follow us on

Bank Strike: బ్యాంకులను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చేస్తుందంటూ బ్యాంక్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం, గ్రామీణ బ్యాంకులు మూతబడ్డాయి.

రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ: 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ, రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంతో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నామని ప్రకటించారు. అంతకుముందు 2019లో.. IDBI బ్యాంక్‌లో మెజారిటీ వాటాను LICకి విక్రయించడం ద్వారా IDBI బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది.

నాలుగేళ్లలో పలు ప్రభుత్వం రంగ బ్యాంకులను కేంద్రం విలీనం చేసింది. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ  ప్రభుత్వం నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది.

అయితే బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయవద్దని పలు బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి దృష్ట్యా, ఉద్యోగుల సమ్మె కారణంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని బ్యాంకు పేర్కొంది. SBI కూడా చర్చల కోసం బ్యాంకు యూనియన్లకు ఆహ్వానం పంపింది..  అయితే బ్యాంకు ఉద్యోగులు ప్రయివేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ సమ్మెకు దిగారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులు, యూనియన్‌లకు తమ సభ్యులను బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ లేఖ రాసింది. సమ్మె చేయవద్దని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) చేసిన విజ్ఞప్తి కూడా ఫలించలేదు. దీంతో రెండు రోజు కూడా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. పలు బ్యాంక్ ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోయాయి.

Also Read:  పాకిస్తాన్ ఎప్పుడో దివాళా.. ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలే అంటూ ఎఫ్‌బిఆర్ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..