బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సడన్‌గా భారత సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేసింది. ప్రస్తుత సమయంలో.. సెక్యూరిటీ కారణాల రీత్యా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ చర్య వల్ల.. సరిహద్దుల్లోని దాదాపు కోటి మంది వినియోగ దారులపై దీని ప్రభవాం పడనుంది.
భారత సరిహద్దుకు కిలో మీటర్ దూరంలో ఉన్న ప్రాంతాల్లో.. సోమవారం నుంచి మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సేవలను నిలిపివేయాలంటూ.. బంగ్లాదేశ్ టెలీకమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ దేశంలోని అన్ని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బంగ్లా మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బీటీఆర్‌సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, భారత్‌లో పౌర సత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన కొద్ది రోజులకే బంగ్లాదేశ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటి ఎఫెక్ట్.. పొరుగు దేశాలపై ఉండే అవకాశముందంటూ బంగ్లా విదేశాంగ మంత్రి మోమెన్ వ్యాఖ్యలు చేశారు.