Ayodya Rama Mandir: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. అయోధ్యలోని రామాలయంలో జరిగే శ్రీరామనవమి వేడుకలను రద్ధు చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో గుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. సోమవారం ఆలయాన్ని మూసివేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించలేదు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. శ్రీరామనవమి వేడుకలను అయోధ్యలో సాంప్రపద్దతిలో కేవలం ప్రధాన పూజారుల మధ్య మాత్రమే నిర్వహించనున్నారు. అలాగే ఇక్కడకు భక్తులకు ప్రవేశం లేదని ట్వీట్ చేశారు. +
భక్తులందరూ.. కోవిడ్ నియమాలను పాటించాలని.. అలాగే ఎవరి ఇళ్ళలో వారే ఉండి.. అక్కడి నుంచి దేవుడిని స్మరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఆరోగ్యంగా ఉంటే.. మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో శ్రీరామనవమి వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవచ్చని తెలిపింది. రామాలయం మూసివేసామని… కాబట్టి భక్తులు రాకూడదని.. ధర్మకర్తలు ఛాంపత్ రాయ్, మహంత్ దినేంద్ర దాస్, డాక్టర్ అనిల్ మిశ్రా మరియు బిమ్లేంద్ర మిశ్రా సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఆసుపత్రులు, ఆక్సిజన్, పరికారాలు, బెడ్స్ కొరత ఏర్పడడంతో ప్రాణనష్టం అధికమవుతుందని ధర్మకర్తలు తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ కుమార్ .. కేవలం ప్రధాన పూజారి ఆధ్వర్యంలోనే నవమి పూజలు జరుగుతాయని.. తదుపరి ఆదేశాల వరకు ఆలయం మూసివేయబడుతుందని తెలిపారు.
మరిన్ని చదవండి : Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..
నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..