Ayodhya Temple: రామమందిర ప్రారంభోత్సవానికి ఊపందుకున్నహోటల్స్ బుకింగ్స్.. భక్తులకు స్వాగతించేలా ఏర్పాట్లు..

|

Jul 29, 2023 | 7:08 AM

జనవరి 20 నుంచి జనవరి 26, 2024 మధ్య రామాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ధర్మశాలల బల్క్ బుకింగ్ కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుకింగ్ అభ్యర్థనలు భారీ సంఖ్యలో ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వస్తున్నాయి.  ప్రారంభోత్సవ వేడుకలు జరిగే వారం రోజుల్లో అయోధ్య పరిశరాల్లోని నివాస యోగ్యమైన గదులను రిజర్వ్ చేసుకుంటున్నారు.

Ayodhya Temple: రామమందిర ప్రారంభోత్సవానికి ఊపందుకున్నహోటల్స్ బుకింగ్స్.. భక్తులకు స్వాగతించేలా ఏర్పాట్లు..
Ayodhya Ram Mandir
Follow us on

రామ జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమవుతోంది. రామ మందిర ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. 2024 జనవరిలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని నిర్ణయించడంతో, దేశవ్యాప్తంగా ట్రావెల్ ఏజెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. TOI నివేదిక ప్రకారం.. జనవరి 20 నుంచి జనవరి 26, 2024 మధ్య రామాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ధర్మశాలల బల్క్ బుకింగ్ కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుకింగ్ అభ్యర్థనలు భారీ సంఖ్యలో ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వస్తున్నాయి.  ప్రారంభోత్సవ వేడుకలు జరిగే వారం రోజుల్లో అయోధ్య పరిశరాల్లోని నివాస యోగ్యమైన గదులను రిజర్వ్ చేసుకుంటున్నారు. అనంతరం వీటిని భక్తులకు అద్దెకు ఇచ్చి అధిక ధరలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

10 వేల మంది అతిథులు వస్తారని అంచనా
శంకుస్థాపన కార్యక్రమానికి దాదాపు 10,000 మంది అతిథులు హాజరవుతారని రామమందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన జనవరి 15  నుంచి జనవరి 24 మధ్య తేదీలను ప్రధానమంత్రికి అందించినప్పటికి.. చివరి తేదీని నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి ఆహ్వానం ప్రకటించిన తర్వాత అయోధ్య వెలుపల ఉన్న ప్రజల్లో ఉత్సాహం పెరగడంతో, జనవరిలో భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉంది. దీని కారణంగా అయోధ్యలోని హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ధర్మశాలలతో సహా ఆతిథ్య సంస్థలు ఢిల్లీ, ముంబై వంటి వివిధ మెట్రో నగరాల నుండి ముందస్తు బుకింగ్ కోసం ఎంక్వైరీలను చేస్తున్నారు.

అయోధ్యతో పాటు సమీప నగరాల్లో కూడా బిజిబిజీ 
భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్లు గోండా, బల్‌రామ్‌పూర్, తారాబ్‌గంజ్, దుమారియాగంజ్, తాండా, ముసాఫిర్ ఖానా , బన్సీ వంటి సమీప నగరాల్లో కూడా బుకింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్స్, గెస్ట్ హౌస్ వంటి వాటిని పరిశుభ్రంగా ఉంచాలని, చక్కగా నిర్వహించడం ద్వారా సిద్ధంగా ఉండాలని హోటల్ యజమానులకు అయోధ్య నిర్వాహకులు సూచించారు. ఈ మేరకు డివిజనల్ కమీషనర్ గౌరవ్ దయాల్ హోటల్ యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో, తరువాత సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున అతిథులను సాదరంగా స్వాగతించేలా అలంకరించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..