Ayodhya Deepotsav: రామమందిరం ఉద్యమంలో ప్రధాని మోదీ పాత్ర.. నాటి శపథం.. నేడు నిజం చేసిన వైనం..

|

Oct 23, 2022 | 3:39 PM

శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యలో నేడు(ఆదివారం) ఘనంగా దీపోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

Ayodhya Deepotsav: రామమందిరం ఉద్యమంలో ప్రధాని మోదీ పాత్ర.. నాటి శపథం.. నేడు నిజం చేసిన వైనం..
Pm Modi
Follow us on

శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యలో నేడు(ఆదివారం) ఘనంగా దీపోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీపోత్సవ్ కార్యక్రమానికి సంబంధించి ఆలయ, ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. ‘భారతదేశ గుర్తింపు, సనాతన ధర్మం ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భగవంతుడు శ్రీరాముడు, మాతా జానకి కొలువై ఉన్న పవిత్ర నివాసమైన అయోధ్యలో నిర్వహిస్తున్న గ్రాండ్-డివైన్ దీపోత్సవ్-2022 లో పాల్గొంటున్నారు.’ అని సీఎం యోగి ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగానే ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు.

కాగా, దీపోత్సవ్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవనున్న నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాంలల్లాను పూజించిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ.. శ్రీ రామ జన్మభూమి తీర్థయాత్రను కూడా పరిశీలిస్తారు. మరోవైపు, దీపోత్సవ్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న నాటి ఫోటోలు..

కాగా, రామజన్మ భూమికి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలో తెగ వైరల్ అవుతున్నాయి. మోదీ ఆర్కీవ్ పేరుతో ఉన్న అకౌంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన కొన్నేళ కిందటి ఫోటోలు షేర్ చేశారు. సోమ్‌‌నాథ్-అయోధ్య రామ్ రథయాత్ర 25 సెప్టెంబర్ 1990న ప్రారంబమైంది. అప్పుడు గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోదీ.. యాత్రకు రథసారధిగా ఉన్నారు. 500 ఏళ్ల నాటి రామ మందిర ఉద్యమం, మోదీ వ్యక్తిగత ప్రతిజ్ఞ ప్రయాణం 5 ఆగస్టు 2020తో ముగిసింది. ఆ రోజున అయోధ్యలో శ్రీరాముని ఆలయానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.

అంతర్జాతీయ రామాయణ సదస్సులో ప్రసంగం..

అంతకు ముందు 1998లో మారిషస్ ‘అంతర్జాతీయ రామాయణ సదస్సు’ని నిర్వహించింది. మోకాలో జరిగిన ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా నాడు నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. శ్రీరాముడి జీవితం గురించి ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని నాటి సదస్సుకు హాజరైన వారు నేటికీ గుర్తుంచుకున్నారు.

నరేంద్ర మోదీని ప్రభావితం చేసిన పద్యం..

శ్రీరామునికి అంకితం చేస్తూ రాసిన ఓ పద్యం నరేంద్ర మోదీని చాలా ప్రభావితం చేసిందట. అంతర్‌దృష్టితో కూడిన చేతితో రాసిన నోట్ నరేంద్ర మోదీని ఎంతగానో ఆకట్టుకుంది. బీజేపీ జమ్మూ కశ్మీర్ లెటర్‌హెడ్‌పై రాసిన ఉన్న ఈ కవిత.. నరేంద్ర మోదీ ఆర్కీవ్ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

లాల్‌ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేత..

కశ్మీర్‌లోని లాల్ చౌక్ వద్ద నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 26 జనవరి 1992 న ఏక్తా యాత్రను ముగించారు. అంతకు కొద్దిరోజుల ముందు అంటే జనవరి 14న, అయోధ్యలోని రామజన్మభూమిని సందర్శించిన నరేంద్ర మోదీ.. మళ్లీ తాను రామ మందిరానికి మాత్రమే తిరిగి వస్తానని ప్రతినబూనారు. అన్నట్లుగానే.. ప్రధాని హోదాలో రామ మందిరానికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ.. ఇవాళ దీపోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాములకు పూజ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..