సనాతన ధర్మం ప్రాముఖ్యత గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సనాతన ధర్మం సురక్షితంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని అన్నారు. ఆపద సమయంలో ప్రతి వర్గానికి.. మతానికి ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మం అని చెప్పారు. అయితే ఇలా హిందువులకు ఎప్పుడైనా ఆశ్రయం ఇవ్వడం జరిగిందా అనడమే కాదు.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో, అంతకు ముందు పాకిస్థాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు.
అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘దేశంలోని సనాతన ధర్మానికి గర్వకారణమైన స్థలాలను ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరు? ఎందుకు అలా చేశారని తాను అడగాలనుకుంటున్నానని అన్నారు. అంతెందుకు ఇలాంటి ధ్వసం వెనుక వారి ఉద్దేశం ఏమిటంటే.. ఇలాంటి అనాగరిక చర్యల ద్వారా మొత్తం భూమిని నరకం చేయాలనే కుట్రలో ఒక భాగం అని చెప్పారు.
ఆలయాల కూల్చివేతలను ప్రస్తావించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ .. కొన్నిసార్లు కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని, కొన్నిసార్లు అయోధ్యలోని రామజన్మభూమిని, కొన్నిసార్లు మథురలోని శ్రీకృష్ణ జన్మభూమిని, కొన్నిసార్లు సంభాల్‌లోని కల్కి అవతారానికి చెందిన హరిహర భూమిని, కొన్నిసార్లు భోజ్‌లోని ఆలయాన్ని ధ్వంసం చేశారు. అన్ని సమయాలలో హిందూ దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఈ దేవాలయాలను కూల్చివేయడం ద్వారా వారి వంశం నాశనం అయింది. రక్తపాతం జరిగింది. నేటికీ వారి వారసులు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారని చెప్పారు.
#WATCH | Ayodhya | Uttar Pradesh CM Yogi Adityanath says, “…I want to ask who were those people who destroyed the Sanatana Dharma’s places of pride in the country and why did they do it? What was the intention behind it? It was a part of the conspiracy to make the whole earth a… pic.twitter.com/nFkTaoKSXP
— ANI (@ANI) December 20, 2024
సిఎం యోగి ఇంకా మాట్లాడుతూ.. ఆలయాన్ని కూల్చివేసిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటని తాను ఎప్పుడైనా ప్రజలను అడిగితే.. వెంటనే ఔరంగజేబు కుటుంబం గురించి చెబుతున్నారని.. ఇప్పుడు అతని వారసులు కోల్‌కతా సమీపంలో రిక్షాలు నడుపుకుంటూ జీవిస్తున్నారని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఒకవేళ ఔరంగజేబు వంశస్తులు కనుక దేవాలయాలను కూల్చివేయకుండా, పాడుచేయకుంటే ఉండి ఉంటే ఈరోజు వారి వారసులకు ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదని చెప్పారు.
దేవాలయాలను అపవిత్రం చేసే వారు, వారి వారసులు నాశనం చేయబడతారు. కాలక్రమంలో ఇబ్బందులు పడతారు. సనాతన ధర్మం మాత్రమే ప్రపంచ శాంతిని నెలకొల్పగలదని అన్నారు.
సనాతన గురించి సీఎం యోగి ఇంకా మాట్లాడుతూ.. “ప్రపంచ మానవ నాగరికత కాపాడబడాలంటే సనాతనాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. వసుదేక కుటుంబము గురించి వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, మునులు చెప్పినది నేటికీ వర్తిస్తుందన్నారు. విపత్తు సమయంలో ప్రతి వర్గానికి, మతానికి ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మం. అయితే ఇలా హిందువులకు ఎప్పుడైనా ఆశ్రయం దొరికిందా..అది బంగ్లాదేశ్‌లో నైనా, పాకిస్థాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లోనైనా సరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..