
AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, అత్తగారు నిషా, బావ అనురాగ్‌లను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. శనివారం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అతుల్ తండ్రి చేసిన ఓ కీలక ప్రకటన వెలుగులోకి వచ్చింది. “ముందుగా బెంగళూరు పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా కుమారుడి చావుకు కారణమైన నేరస్తులను పోలీసులు అరెస్టు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ నా మనవడు వ్యోమ్ ఎక్కడ ఉన్నాడో మాకు సమాచారం లేదు. మేము అతని గురించి ఆందోళన చెందుతున్నాము” అని ఆయన పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా అతుల్ తండ్రి పవన్ మోడీ మాట్లాడుతూ.. నికితా నా అమాయక మనవడిని ఎక్కడ ఉంచిందో నాకు తెలియదు. అతను బతికే ఉన్నాడా లేదా? ఏమీ తెలియదు. అతనికి కూడా ఏదైనా జరిగి ఉంటుందని మేము భయపడుతున్నాము. మాకు కావలసింది వ్యోమ్ కస్టడీలో ఉండడమే. మనవడిని మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాం. తాతకు కొడుకు కంటే మనవడే గొప్ప. అందరూ మాకు మద్దతుగా ఉన్నారు. మనవడిని కోర్టు మాకు అప్పగించాలి. ఇది పిల్లవాడి భవిష్యత్తుకు మేలు చేస్తుంది అని చెప్పాడు.
వ్యోమ్ మా కుమారుని చివరి గుర్తు. కోర్టు అతన్ని మాకు అప్పగించాలి. అతడిని బాగా చూసుకుంటాం. మనవళ్లతో చివరి సారి గడపాలనుకుంటున్నాం. అతుల్ ఇక లేరు, కానీ మనవడు మాతోనే ఉండిపోతే బహుశా మా గుండెల్లో ఉన్న గాయాలు కొంతైనా తగ్గుతాయి. మా మనవడిని పొందేందుకు మాకు సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లతో సహా నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
అతుల్ సోదరుడు వికాస్ మోదీ, కోడలు సహా నలుగురు నిందితులపై సెక్షన్ 108 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 14న బెంగళూరు పోలీసులు నికిత, నిషా, అనురాగ్‌లను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. భారత చట్టం ప్రకారం, ఈ విషయంలో నలుగురికీ 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.
ఇది కూడా చదవండి: బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం..ఇప్పుడు అతుల్ ఆత్మ శాంతిస్తుందంటున్న నెటిజన్లు!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి