Election 2022: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంక్షలు మరోసారి పొడగింపు..

|

Jan 15, 2022 | 7:52 PM

EC - Assembly polls: దేశంలో వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Election 2022: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంక్షలు మరోసారి పొడగింపు..
Election Expenditure
Follow us on

EC – Assembly polls: దేశంలో వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం ఐదు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఈసీ సమీక్షించింది. ఈ మేరకు ఇప్పటికే విధించిన ఆంక్షలను జనవరి 22 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందంటూ పేర్కొంది. ఇక 300 మందితో ఇండోర్‌ (క్లోజ్డ్‌) సభలకు అనుమతి ఇస్తూ.. హాల్ కెపాసిటీలో 50% మందితో సభ నిర్వహించుకునేందుకు పార్టీలకు అనుమతి ఇచ్చింది. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

కాగా.. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నిత్యం పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అయితే.. షెడ్యూల్ ప్రకటన నాటికే కేసులు పెరుగుతుండటంతో ఎన్నికల సంఘం.. ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం కరోనా పరిస్థితులపై సమీక్షించిన ఈసీ నిషేధాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్‌లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. కాగా.. ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 10న జరుగనుంది.

Also Read:

Viral Video: తోపులనే తలదన్నేలా.. ఈత కొట్టేందుకు భారీ జంప్ చేసిన శునకం.. వీడియో వైరల్..

Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!