
తమిళనాడులో DMK 103-113, ADMK 114-124 , TVK 4-10; Others 0
కేరళలో LDF 58-687, UDF 70-80, NDA 0-4, Others 0
అసోంలో BJP 90-100; INC 22-33; Others 0-6
బెంగాల్‌లో TMC-177-187; BJP -95-100, కాంగ్రెస్ 0, లెఫ్ట్ 0-1, ఇతరులు 1-2
తమిళనాడులో DMK 125 – 145; ADMK 65 -80, TVK 18-24; Others 2-6
కేరళలో LDF 55-65; UDF 75-87, NDA 0-3, Others 0
అసోంలో BJP 68-72; INC 22-26; Others 3-5
పుదుచ్చేరిలో NDA 16-19; INC+ 10-12; Others 1-2
బెంగాల్‌లో అధికార మార్పు తప్పదంటున్న పీ మార్క్
ఎన్డీయే కూటమి 152-175 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా
టీఎంపీ 118-138 స్థానాల్లో గెలుస్తుందన్న పీ మార్క్
కాంగ్రెస్‌కు 0-1, ఇతరులకు 2-6 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడి
కేరళలో ఎల్‌డీఎఫ్‌దే అధికారమంటున్న మ్యాట్రిజ్
UDF -75-85 స్థానాల్లో గెలుస్తుందన్న మ్యాట్రిజ్
LDF- 60-65 స్థానాల్లో గెలుస్తుందన్న మ్యాట్రిజ్
BJP – 3-5 స్థానాల్లో గెలుస్తుందన్న మ్యాట్రిజ్
బెంగాల్‌లో అధికార మార్పు తప్పదంటున్న చాణక్య సర్వే
బీజేపీకి 150-160 స్థానాలు వస్తాయని చాణక్య అంచనా
టీఎంసీకి 130-140 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్న చాణక్య
ఇతరులు 4-6 స్థానాలు గెలవచ్చని చెప్పిన చాణక్య స్ట్రాటజీస్
అసోంలో ఎన్డీయేదే అధికారమంటున్న యాక్సిస్ మై ఇండియా
అధికార ఎన్డీయే కూటమి 88-100 స్థానాలు వస్తాయన్న సర్వే
కాంగ్రెస్ కూటమి 24-36 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచాన
ఇతరులు 0-3 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్ పల్స్ సర్వే
బెంగాల్‌లో 294 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు
బెంగాల్‌లో మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు
బెంగాల్‌లో మరోసారి మమతా బెనర్జీదే అదికారమంటున్న పీపుల్ పల్స్ సర్వే
టీఎంసీ 177-187 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న పీపుల్ పల్స్
బీజేపీ 95-110 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న పీపుల్ పల్స్
కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయన్న సర్వే
కేరళ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే
కేరళలో యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమన్న పీపుల్ పల్స్ సర్వే
కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమి
కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు, కేరళలో మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు
2026 ఎన్నికల్లో యూడీఎఫ్‌కు 75-85 సీట్లు గెలిచే అవకాశం ఉందన్న పీపుల్ పల్స్
ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయన్న సర్వే
యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వే
అస్సాం ఎన్నికలపై పీపుల్ పల్స్ సర్వే
అస్సాంలో మళ్లీ NDA కూటమిదే అధికారమంటున్న పీపుల్ పల్స్
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు
అస్సాంలో మ్యాజిక్ ఫిగర్ 64 స్థానాలు
ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 68-72 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్న పీపుల్ పల్స్
కాంగ్రెస్ పార్టీకి 22-26 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే
తమిళనాడులో మళ్లీ డీఎంకేనే అధికారంలోకి వస్తుందన్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే
ఈ సారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్
గత 2021 ఎన్నికల కంటే 11 శాతం పెరిగిన ఓటింగ్
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు
డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని తెలిపిన పీపుల్ పల్స్ సర్వే
ఏఐడీఎంకే 65-80 స్థానాలతో గెలిచే అవకాశం ఉందని వెల్లడి
టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయన్న పీపుల్ పల్స్
డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే ఛాన్స్
పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి
పుద్దుచ్చేరిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన పీపుల్ పల్స్ సర్వే
పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు
సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు
ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడి
ముగిసిన పశ్చిమ బెంగాల్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
8 జిల్లాల్లో 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తి
క్యూ లైన్లలో నిలబడి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న అధికారులు
బెంగాల్ చరిత్రలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు
మొదటి విడతలో 93 శాతం పోలింగ్ నమోదు
రెండో విడతలో సైతం 93 శాతం దిశగా పోలింగ్
మరికాసేపట్లో స్ట్రాంగ్ రూమ్స్ కి ఈవీఎం,వివిప్యాట్ యంత్రాల తరలింపు
మరికాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్ అంచనాలు
West Bengal Exit Polls 2021: 2021లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే.. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొత్తం తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ పార్టీనే విజయం సాధిస్తుందని చాలా వరకు సర్వేలు చెప్పగా.. కానీ ఫలితాల్లో మాత్రం తృణముల్ కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ కనబరిచింది. వరుసగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టి దీదీ సీఎం అయ్యారు. ఇవే కాదు 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. అప్పుడు కూడా మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో బీజేపే మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని పలు సర్వేలు చెప్పగా.. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ 31 స్థానాలను గెలిచింది. బీజేపీ మాత్రం కేవలం 9 సీట్లకే పరిమితమైంది
బెంగాల్ రెండో విడత పోలింగ్‌లో అందరి దృష్టి కోల్‌కతాలోని భవానిపూర్ నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ నియోజవర్గం నుంచే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు పోటీ పడుతున్నారు. అయితే 2011 నుండి ఈ భవానిపూర్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఈ సారి సీఎం మమతా బెనర్జీ ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఎన్నికల్లో పోటీ పడడం ఇదే తొలిసారి ఏం కాదు. గత 2021 ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ పోటీపడ్డారు.
- కాసేపట్లో ముగియనున్న బెంగాల్ రెండోదశ ఎన్నికల పోలింగ్
- సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో వేచివున్న వారందరికీ ఓటు వేసే అవకాశం.
- పలు పోలింగ్ కేంద్రాల ముందు క్యూలైన్లు
- తుది విడతలో మొత్తం 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
బెంగాల్‌లో కొనసాగుతున్న రెండడో దశ పోలింగ్
తప ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న దీదీ
ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మమత
కేంద్ర బలగాలు ఎన్ని కుట్రలు చేసినా విజయం తమదేనన్న సీఎం
బెంగాల్ రెండో దశ పోలింగ్‌లో బంపర్ ఓటింగ్
మధ్యాహ్నం 3 గంటల వరకు 79 శాతం పోలింగ్
పలు చోట్ల TMC, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపణ
బీజేపీ గుర్తుపై టేప్ అతికించారన్న బీజేపీ నేతలు
టేప్ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామన్న ఈసీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఉంది. బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొండి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్‌లో ఏప్రిల్ 23తొలి విడత జరగ్గా ఇవా రెండు విడత ఎన్నికలు జరిగాయి. అయితే రెండు విడతల్లోనే రాష్ట్రంలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. దీంతో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అటు దీదీ పట్టుదలతో ఉన్నారు.
తమిళనాడు: ఇక ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే తమిళానడు పోలింగ్ పూర్తైంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 234 స్థానాలకు గాను ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 85 శాతం పైగా ఓటింగ్ నమోదైంది.అయితే ఈ సారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండగా ఈ సారి మాత్రం నటుడు విజయ్ టీవీకే ఎంట్రీలో మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది.
ఇక కేరళా విషయానికి వస్తే ఇక్కడ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 140 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగ్గా సుమారు 74 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ నేత విజయన్ ధీమాగా ఉండగా, ఈసారి మార్పు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అటు అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. సీఎం హిమంత బిశ్వ శర్మ, గౌరవ్ గొగొయ్ మధ్య ప్రచార పర్వం జోరుగా సాగింది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరిలో కూడా ఎన్డీయే, ఇండియా బ్లాక్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి. ఇక బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు ముగియగానే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
బెంగాల్‌లో తుది దశ పోలింగ్
అయితే బెంగాల్‌లో రెండో దశ పోలింగ్‌లో దాదాపు తుది దశకు చేరుకుంది. తొలి దశలో మాదిరి ఇప్పుడు కూడా బెంగాల్‌లో బంపర్ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి. 90 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 79 శాతం పోలింగ్ నమోదయ్యింది.
అయితే ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ గుర్తుపై టేప్ అతికించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ టేప్ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని , అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
అయితే ఈ పోలింగ్‌లో రాజకీయా నేతలు, సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా తాను పోటీ చేస్తున్న భవానీపూర్‌లో ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం బలగాలు ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీదే గెలుపన్నారు. పోలింగ్ బూత్ దగ్గర విక్టరీ సంకేతాన్ని చూపించారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.