Assembly Election Results 2022: నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa), మణిపూర్(Manipur), పంజాబ్(Punjab) ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే దేశం మొత్తం ఉత్తరప్రదేశ్‌పైనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ గెలవబోతోందనేది దేశం మొత్తం ఆసక్తి రేపుతోంది. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు పోలీసులు. 671 మంది కౌంటింగ్ పరిశీలకులు, 130 మంది పోలీసు అబ్జర్వర్లు, 10 మంది ప్రత్యేక పరిశీలకులు రంగంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఐదు రాష్ట్రాల్లో దాదాపు 50వేల మందికిపైగా అధికారులు ఉన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సీఏపీఎఫ్, పీఏసీ, సివిల్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద వీడియో, స్టాటిక్ కెమెరాలను అమర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఉత్తరప్రదేశ్ అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు మొత్తం 250 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్ (CAPF)లు అందించినట్లు పోలీసులు తెలిపారు. ఒక CAPF కంపెనీలో సాధారణంగా 70 నుంచి 80 మంది సిబ్బంది ఉంటారని అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని ఓట్ల లెక్కింపు వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. ఉత్తరప్రదేశ్‌లో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి: