Aam Aadmi Party: గుజరాత్ ఎన్నికల ఫలితాలతో జాతీయ పార్టీ హోదా.. మరో అడుగుదూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ..

|

Dec 08, 2022 | 11:28 AM

ఢిల్లీ, పంజాబ్, గోవాలలో ఇప్పటికే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడం ద్వారా జాతీయ పార్టీ హోదాను సాధించడానికి AAP కేవలం ఒక రాష్ట్రం దూరంలో ఉంది.

Aam Aadmi Party: గుజరాత్ ఎన్నికల ఫలితాలతో జాతీయ పార్టీ హోదా.. మరో అడుగుదూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ..
Aam Aadmi Party Will Aap Get National Party Status
Follow us on

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు (డిసెంబర్ 8) వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా కనిపించనుంది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఫలితాలు చాలా ముఖ్యమైనవి.. ఎందుకంటే ఇవాళ జాతీయ పార్టీ హోదాను సాధించగలదు. ఢిల్లీ, పంజాబ్, గోవాలలో ఇప్పటికే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడం ద్వారా జాతీయ పార్టీ హోదాను సాధించడానికి AAP కేవలం ఒక రాష్ట్రం దూరంలో మాత్రమే ఉంది.

జాతీయ పార్టీ హోదా పొందాలంటే నియమాలు ఏంటి..? 

జాతీయ పార్టీ హోదా పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంస్థ గుర్తింపు పొందాలి. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే రాష్ట్రంలో కనీసం రెండు సీట్లు గెలవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. అంటే.. జాతీయ పార్టీగా అవతరించేందుకు గురువారం జరిగే ఓట్ల లెక్కింపులో ఆప్ రెండు సీట్లు గెలుచుకుని 6 శాతం ఓట్లను సాధించాల్సి ఉంది.

AAPకి గుజరాత్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ కంటే గుజరాత్‌లోనే భారీ ప్రచారం నిర్వహించింది. బీజేపీకి కంచుకోట అయిన గుజరాత్‌లో పాగా వేయడానికి, AAP మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. దూకుడు ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

సంఖ్యాపరంగా నంబర్ టూగా ఉన్న కాంగ్రెస్‌ను ఆప్ విజయవంతంగా గద్దె దించి.. బీజేపీకి ప్రధాన సవాల్‌గా ఎదగగలదా అనేది మోదీ సొంత రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. ఇదే జరిగితే 2024 లోక్ సభ ఎన్నికల్లో మోడీ రథాన్ని ఆపడంలో కేజ్రీవాల్ పాత్ర కూడా తేలిపోనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం