Golden Pearl: కిలో గోల్డెన్ పెర్ల్‌కు రూ.99.999 ధర.. రికార్డులు బద్దలు కొట్టిన అస్సాం తేయాకు..

|

Feb 16, 2022 | 7:14 AM

టీ ధర అంటే, ఏ పది రూపాయలో, లేదంటే ఇరవై రూపాయలో అనుకుంటాం. కానీ అస్సాంలో మాత్రం ఏకంగా లక్షంట. పోటీ పడి మరీ గోల్డెన్ పెర్ల్‌ను కొంటున్నారట.

Golden Pearl: కిలో గోల్డెన్ పెర్ల్‌కు రూ.99.999 ధర.. రికార్డులు బద్దలు కొట్టిన అస్సాం తేయాకు..
Golden Pearl
Follow us on

అస్సాం తేయాకు రికార్డులు బద్దలు కొట్టింది. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాకు చెందిన ఒక స్పెషల్ టీ పొడి వేలంలో కిలో రూ. 99వేల 999 రూపాయల ధర పలికింది. దేశంలో ఇప్పటివరకు ఏ టీ వేలంలో ఇంత ధర పలకలేదు. అస్సాం టీ ట్రేడర్స్ ఒక కిలో గోల్డెన్ పెర్ల్ టీని రూ. 99వేల 999కి కొనుగోలు చేశారని వెల్లడించారు GTAC కార్యదర్శి ప్రియనుజ్ దత్తా. దిబ్రూగఢ్ విమానాశ్రయానికి సమీపంలోని లాహోవల్‌ జలుక్‌బరిలో, చేతితో తయారు చేసిన సున్నితమైన రకానికి చెందిన ఉత్పత్తి ఇది అని తెలిపింది, టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.  గౌహ‌తి టీ వేలం సెంట‌ర్‌లో ఈ వేలం పాట నిర్వహించారు అధికారులు. దేశంలో టీ వేలంలో లభించిన అత్యధిక ధర ఇదేనని చెబుతున్నారు ఆక్షన్ నిర్వహించిన ఆఫీసర్లు. గ‌తంలో న‌మోదు చేసిన రికార్డును ఈ తేయాకు బద్దలు కొట్టేసింది.

వేలంలో అత్యధిక బిడ్డింగ్‌ వేసి దీన్ని దక్కించుకున్నారు అస్సాం టీ ట్రేడర్స్‌ ప్రతినిధులు. అయితే ఈ ప్రత్యేకమైన గోల్డెన్ పెర్ల్ టీకి చాలా డిమాండ్ ఉంది. దీని ఉత్పత్తి కూడా తక్కువగా ఉందంటూ చెబుతున్నారు టీ ట్రేడర్స్‌ ప్రతినిధులు. ఎన్నో రోజుల నుంచి తాము ఈ టీ పొడిని సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే తేయాక తోట యజమాని దానిని తమకు ప్రైవేట్‌గా విక్రయించడానికి నిరాకరించాడని వివరించారు. దాన్ని వేలం వేయడంతో ఎలాగైనా దక్కించుకోవాలని గట్టిపోటీ ఇచ్చామన్నారు. గతంలో మ‌నోహ‌రి గోల్డ్ టీ కిలో 75 వేల‌ రూపాయలకు అమ్ముడుపోయింది. అటు 2018లోనూ ఇదే బ్రాండ్ కు సంబంధించి కిలో తేయాకు 39వేల ధర పలికింది. తర్వాత సంవత్సరం 50 వేలకు, 2020లో, 75 వేల ధర పలికింది ఈ గోల్డెన్ పెర్ల్.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?