అతనో గవర్నమెంట్ డాక్టర్. విధి నిర్వహణలో అలసత్వం వహించాడు. కడుపులో పెయిన్ అంటూ హాస్పిటల్‌కి వెళ్లిన ప్రెగ్నెంట్ మహిళకు.. నెలలు నిండకముందే శస్త్రచికిత్స చేసి.. బేబీని బయటకు తీశాడు. అయితే పిండం పూర్తి వృద్ధి చెందకపోవడంతో.. మళ్లీ పొట్ట లోపల పెట్టి స్టిచ్చెస్ వేశాడు. వైద్యుడి నిర్లక్ష్యంపై ఫ్యామిలీ మెంబర్స్, స్థానికులు భగ్గుమన్నారు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. అసోం(Assam)లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నవీ నమశూద్ర అనే 7 నెలల ప్రెగ్నెంట్ మహిళ.. కడుపులో నొప్పి రావడంతో.. కరీంగంజ్( Karimganj)లోని గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి గైనకాలజిస్ట్ ఆశిష్ కుమార్ బిస్వాస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. సరైన టెస్టులు చేయకుండాగానే.. బిడ్డను డెలీవరి చేసేందుకు శస్త్రచికిత్స చేశారు. ఆపై బేబీని బయటకు తీసి చూడగా.. పిండం పూర్తిగా పరిపక్వం చెందలేదు. దీంతో మళ్లీ పిండాన్ని పొట్టలోనే పెట్టి పెట్టి కుట్లు వేశాడు. ఈ ఘటన జరిగిన 12 రోజుల తర్వాత బుధవారం సదరు గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం