KK Dies Of SCA: అలా చేసి ఉంటే కేకే బతికేవారేమో.. కోల్‌కతా వైద్యుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jun 03, 2022 | 8:50 PM

KK Dies Of SCA: ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కృష్ణకుమార్‌ కున్నథ్‌ (కేకే) ఆకస్మిక మరణం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసిన విషయం తెలిసిందే. కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలుగులోనూ కేకే ఎన్నో సూపర్ హిట్‌ సాంగ్స్‌ను ఆలపించారు...

KK Dies Of SCA: అలా చేసి ఉంటే కేకే బతికేవారేమో.. కోల్‌కతా వైద్యుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
Singer Kk
Follow us on

KK Dies Of SCA: ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కృష్ణకుమార్‌ కున్నథ్‌ (కేకే) ఆకస్మిక మరణం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసిన విషయం తెలిసిందే. కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలుగులోనూ కేకే ఎన్నో సూపర్ హిట్‌ సాంగ్స్‌ను ఆలపించారు. గత మంగళవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన లైవ్‌ షో జరిగిన కాసేపటికే కేకే అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఇదిలా ఉంటే గురువారం కేకే భౌతిక కాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు ఆయన గుండె పోటుతో మరణించినట్లు అంచనాకు వచ్చారు. గుండె రక్తనాళాల్లో పలు చోట్ల పూడికలు ఏర్పడినట్లు, కేకే మరణానికి అవే కారణమైనట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. ఇదిలా ఉంటే గుండె పోటుతో అస్వస్థతకు గురైన వారికి మొదటి పది నిమిషాల్లో సరైన వైద్యం అందిస్తే అపాయం నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయమై మేదాంత మేనేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేష్‌ ట్రెహాన్‌ టీవీ9తో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హృదయ సంబంధిత రోగాల గురించి నరేష్‌ ట్రెహాన్‌ ఏమన్నారో వారి మాటల్లోనే..

గుండె పోటుతో అస్వస్థకు గురైన వ్యక్తికి మొదటి పది నిమిషాలు చాలా కీలకం. గుండె పోటుతో కుప్పకూలిన వ్యక్తికి ఎవరైనా సకాలంలో సీపీఆర్‌ (CPR) చేస్తే వారు ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే వరకు మనిషి ప్రాణంతో ఉండగలుగుతాడు. అయితే ఇది మొదటి పది నిమిషాల్లోనే చేస్తే ఫలితం ఉంటుంది. రక్తపోటు 40-50కి తగ్గినప్పటికీ ఆసుపత్రికి తీసుకెచ్చే సమయానికి సదరు వ్యక్తి గుండె ఇంకా చలనంలో ఉంటే అతన్ని బతికించొచ్చని డాక్టర్‌ తెలిపారు. పూర్తి స్థాయి వైద్యం అందే లోపు సీపీఆర్‌ ద్వారా రోగిని 20-30 నిమిషాలపాటు రక్షించవచ్చన్నారు. సాధారణంగా రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్లే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎవరిలోనైనా హృద్రోగ సంబంధిత లక్షణాలు అయితన ఛాతీనొప్పి లాంటివి కనిపిస్తే వెంటనే 300 మిల్లీ గ్రాముల ఆస్పిరిన్‌ను అర గ్లాసు నీటిలో కరిగించి తాగించాలి. ఇలా చేయడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా ఉండడంలో సార్బిట్రేట్‌ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఛాతినొప్పి ఉన్న వ్యక్తికి 5 ఎమ్‌జీ టాబ్లెట్‌ను నాలుక కింద ఉంచితే వెంటనే ట్యాబ్లెట్‌ ధమనులకు విస్తరిస్తుంది. దీనిద్వారా రక్త ప్రవాహాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అయితే నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటివి చేయాలి లేకపోతే రోగి ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని నరేష్‌ ట్రెహాన్‌ సూచించారు.

ఇక ఊపిరితిత్తుల్లో తగినంత ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల వచ్చే సమస్యను హైపోక్సియా అంటారు. ఈ సమస్య ఉన్న వారిలో గుండె ఆగిపోవడం, మెదడుపై ప్రభావం పడుతుంది. అయితే ఇది ఉన్నపలంగా జరగదు, ఇలాంటి వారిలో దీర్ఘకాలంగా ఆ తాలుకు లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లల్లో రక్తం గడ్డకట్టే వ్యక్తుల్లో ఈ రక్తం విచ్చిన్నమై ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల శ్వాస అందక మరణానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఆకస్మిక మరణాలు కేవలం హృదయ స్పందనలో వచ్చే మార్పుల కారణంగానే జరుగుతాయి. అధిక రక్త పోటు ధమనులను దెబ్బతీస్తుంది, ఇది మనిషి ఆకస్మిక మరణానికి కారణమవుతుందని డాక్టర్‌ నరేష్‌ ట్రెహాన్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..