Ashwini Vaishnaw: రూ.17 వేల కోట్లతో PLI 2.0.. ఐటీ హార్డ్‌వేర్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చిన మోడీ సర్కార్..

|

May 17, 2023 | 9:46 PM

భారతదేశంలో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (Production Linked Incentive) మంచి సత్ఫలితాలనిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం ప్రభావం ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అత్యంత ఎక్కువగా ఉంది.

Ashwini Vaishnaw: రూ.17 వేల కోట్లతో PLI 2.0.. ఐటీ హార్డ్‌వేర్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చిన మోడీ సర్కార్..
Union Minister Ashwini Vaishnaw
Follow us on

భారతదేశంలో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (Production Linked Incentive) మంచి సత్ఫలితాలనిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం ప్రభావం ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అత్యంత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో.. మరోసారి ఐటీ హార్డ్‌వేర్‌ రంగానికి కేంద్రం భారీగా పీఎల్ఐ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఐటీ హార్డ్‌వేర్ విభాగంలో రూ.17,000 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కాల పరిమితిని కేబినేట్ ఆరేళ్లుగా నిర్దేశించిందని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆన్‌-ఇన్‌-వన్‌ పీసీలు, సర్వర్లు, అల్ట్రా – స్మాల్‌ ఫారమ్ ఫ్యాక్టర్‌ డివైజ్‌ల తయారీ ఐటీ హార్డ్‌వేర్‌ కిందకు వస్తాయి. వీటి తయారీలో ఉన్న కంపెనీలకు పీఎల్‌ఐ 2.0 కింద ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హత ఉంటుందని సమావేశం అనంతరం అశ్విని వైష్ణవ్ తెలిపారు.

కేంద్రం నిర్ణయంతో జోష్ మరింత పెరిగిందని.. ఇండస్ట్రీ ఛాంపియన్‌లు ప్రధాని నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఈ పథకం ద్వారా రూ. 3.35 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తి పెరుగుతుందని, రూ. 2,430 కోట్ల ఇన్‌క్రిమెంటల్ ఇన్వెస్ట్‌మెంట్ తోపాటు పాటు.. 75,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించవచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్..

కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో తొలిసారి పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకురాగా.. ఇది ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు మరింత ఊతమిచ్చింది. దీంతో ఫోన్ తయారీ రంగంలో భారత్ అగ్రగ్రామిగా నిలిచింది. 2021 ఫిబ్రవరిలో ఈ రంగానికి రూ.7,350 కోట్లు కేటాయించగా.. ఈ మొత్తాన్ని మరింత పెంచాలని పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కేటాయింపులను భారీగా పెంచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..