Rajasthan: రాజస్థాన్‌లో జరిగిన ఘటనపై స్పందించిన సీఎం.. బాధితురాలికి ఆర్థిక సాయం

రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసి నగ్నంగా ఉరేగించిన ఘటన సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసకోవాలని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై సీఎం మీడియాతో స్పందించారు. మహిళను వివస్త్రను చేసి ఉరేగించిన ఘటనపై దర్యాప్తును స్పెషల్ ఇన్సెస్టిగేషన్ బృందానికి అప్పగించామని తెలిపారు.

Rajasthan: రాజస్థాన్‌లో జరిగిన ఘటనపై స్పందించిన సీఎం.. బాధితురాలికి ఆర్థిక సాయం
Cm Ashok Gehlot

Updated on: Sep 02, 2023 | 9:15 PM

రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసి నగ్నంగా ఉరేగించిన ఘటన సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసకోవాలని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై సీఎం మీడియాతో స్పందించారు. మహిళను వివస్త్రను చేసి ఉరేగించిన ఘటనపై దర్యాప్తును స్పెషల్ ఇన్సెస్టిగేషన్ బృందానికి అప్పగించామని తెలిపారు. బాధితురాలి భర్తతో పాటు మరో 10 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆ మహిళకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఆమెకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ఆమెకు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే రాజస్థాన్ అలాంటి మరో దారుణ ఘటన వెలుగులోకి రావడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. అయితే పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పది మంది ముందే ఆమెపై దాడి చేసి.. వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడని చెప్పారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలం వల్లే కన మీనా ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని చెప్పారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయ రగడ కూడా మొదలైంది. దీంతో ముఖ్యమంత్రి ఈ కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతను ఎస్‌ఓటీకి అప్పగించారు. అలాగే గర్భవతియైన బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలని.. ఆమె అవమానకరమైన బాధను తెగువతో భరించిందని అన్నారు. ఆమె ఆర్థిక, సామజిక పరిస్థితిలు దృష్ట్యా.. ఆమెకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఒక ఉద్యోగాన్ని ఇస్తున్నామని తెలిపారు. బాధితురాలికి ఎలాంటి సాయం కావాలన్న కూడా ప్రభుత్వం తరపున అందేస్తామని పేర్కొన్నారు.