Shivsena MP Sanjay Raut on AIMIM: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాధి కూటమిలోకి ఎంఐఎంను తీసుకునే ప్రస్తకే లేదంటూ స్పష్టం చేశారు. మహరాష్ట్రలో అధికార కూటమి అయిన మహావికాస్ అగాధిలోకి ఎంఐఎంకు చోటు ఉంటుందా అన్న ప్రశ్నకు వైల్డ్‌గా రియాక్టయ్యారు సంజయ్‌రౌత్. ఎంఐఎంతో పొత్తు అంటే ఓ రోగాన్ని అంటించుకోవడమేనంటూ ఘాటుగా స్పందించారు. ఔరంగజేబు సమాధి ఎదుట మోకరిల్లే పార్టీతో మాకు పొత్తా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీతో పొత్తంటే అంటురోగంతో సమానమన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శాలను అనుసరించే శివసేనకు ఎంఐఎం (MIM)తో పొత్తు ఎన్నటికీ కుదరదన్నారు. ఇప్పుడే కాదు భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆలోచనకు తావులేదని స్పష్టం చేశారు సంజయ్‌రౌత్. ఎంఐఎంతో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ బీ టీం ఎంఐఎం అని.. పొత్తు ఎప్పటికీ కుదరదంటూ అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీకి ఎంత దూరంగా ఉంటే శివసేనకు అంతమంచిదన్నారు సంజయ్ రౌత్. ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
మహరాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఉందని.. ఆ కూటమిలోకి నాలుగో పార్టీకి అవకాశమే లేదన్నారు. తామిద్దరం కలుసుకున్నంత మాత్రాన.. దానర్థం కూటమిలోకి ఆహ్వానించడం కాదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్. అటు ఎంఐంఎ నేత ఇంతియాజ్ జలీల్ కూడా మహరాష్ట్ర కూటమిలో చేరికపై స్పందించారు. తాము కూటమిలోకి రావడం శివసేన అంగీకరించదని ముందే తెలుసన్నారు. మొత్తంగా ఎంఐఎం, శివసేన మధ్య పొత్తనేది సాధ్యం కాని విషయమని స్పష్టమవుతోంది.
Also Read: