Aryan Khan Case: ఆర్యన్ డ్రగ్ కేసులో రూ.25 కోట్లు డిమాండ్ చేసిన సమీర్.. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు.. మాజీ ఎన్‌సీబీ అధికారిపై కేసు నమోదు

|

May 13, 2023 | 1:43 PM

ముంబై ఎన్‌సీబీ మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. షారుఖ్ తనయుడిని డ్రగ్స్ కేసు నుంచి బయటపడేస్తానంటూ రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలను సమీర్ ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై చర్యలు చేపట్టారు సీబీఐ అధికారులు.  

Aryan Khan Case: ఆర్యన్ డ్రగ్ కేసులో రూ.25 కోట్లు డిమాండ్ చేసిన సమీర్.. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు.. మాజీ ఎన్‌సీబీ అధికారిపై కేసు నమోదు
Sameer Wankhede Ncb
Follow us on

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు  ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుని దర్యాప్తు చేసిన ఎన్‌సిబి మాజీ చీఫ్ సమీర్ వాంఖడే మళ్ళీ వార్తల్లో నిలిచారు. ముంబై ఎన్‌సీబీ మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. షారుఖ్ తనయుడిని డ్రగ్స్ కేసు నుంచి బయటపడేస్తానంటూ కోట్లు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలను సమీర్ ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై చర్యలు చేపట్టారు సీబీఐ అధికారులు.

క్రూయిజ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్ ను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఎన్‌సిబి మాజీ చీఫ్ సమీర్ వాంఖడే షారుఖ్ ఖాన్ ను లంచం డిమాండ్ చేసారని.. ఆర్యన్ తండ్రి నటుడు షారూఖ్ ఖాన్ నుంచి సమీర్ వాంఖడే సహా మరో నలుగురు అధికారులు రూ. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయంపై సమీర్ స్పందిస్తూ..

ఇవి కూడా చదవండి

తాను లంచం డిమాండ్ చేశాననం ఆరోపణలపై మరణం వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. అంతేకాదు కంట నీరు వస్తున్నా తన భావోద్వేగాలను అణచివేసుకుంటూ ఇలా అన్నారు, “కేవలం రెండేళ్ల వయసున్న పిల్ల 12 మందితో పోరాడుతుంటే.. 70 ఏళ్లు పైబడిన మా నాన్న 7 నుంచి 8 మందితో పోరాడుతున్నారని.. మరోవైపు తన అత్తమామల విషయంలో కూడా అదే పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అందరికి ఒక వార్త మాత్రమే.. కానీ ఈ ఆరోపణలు కుటుంబ భద్రత.. అంటూ తాము ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నట్లు పేర్కొన్నారు.

వాంఖడే నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. శుక్రవారం సీబీఐ అధికారులు ముంబయి,ఢిల్లీ, రాంచీ, కాన్పుర్‌లలో వాంఖడేకు చెందిన 29 ప్రాంగణాల్లో తనిఖీలు చేశారు. అయితే ఈ మాజీ ఎన్‌సిబి చీఫ్ సమీర్  రాజకీయాల్లో చేరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు  తెలుస్తోంది.

2021 అక్టోబరులో ఆర్యన్ ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన వాంఖడే రూ.25 కోట్లు లంచం డిమాండ్‌ చేసినల్టు . అడ్వాన్సుగా రూ.50లక్షలు స్వీకరించినట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సమీర్ పై విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే తన కుటుంబానికి ముంపు పొంచి ఉందని సమీర్ భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..