పంజాబ్ లో ‘పాగా’కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు అమృత్ సర్ టూర్…… అక్కడా తడాఖా చూపుతామని ప్రకటన

| Edited By: Phani CH

Jun 20, 2021 | 1:48 PM

పంజాబ్ లో తమ ఆప్ పార్టీని బలోపేతం చేసి విస్తరించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు.

పంజాబ్ లో పాగాకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు అమృత్ సర్ టూర్...... అక్కడా తడాఖా చూపుతామని ప్రకటన
Arvind Kejriwal
Follow us on

పంజాబ్ లో తమ ఆప్ పార్టీని బలోపేతం చేసి విస్తరించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇటీవల గుజరాత్ పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్.. అహమ్మదాబాద్ లో తమ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 27 సీట్లను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడంతో ఇక గుజరాత్ లో కూడా తమ హవా చాటడానికి ఆయన సిద్ధపడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీకి సైతం వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. కాగా రేపు తాను అమృత్ సర్ ను విజిట్ చేస్తానని, అక్కడ ఆప్ పటిష్టతకు తీసుకోవలసిన చర్యలను సమీక్షిస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ను తమ పార్టీలో చేర్చుకోవచ్చు. 2015 లో కోటక్ పురాలో జరిగిన పోలీసు కాల్పులపై దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ఆయన ఒకరు. అయితే ఆ తరువాత ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడంతో ఈ ఉదంతం తాలూకు రిపోర్టును పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది.

మూడు నెలల్లో కేజ్రీవాల్ పంజాబ్ ను సందర్శించడం ఇది రెండో సారి. గత మార్చి నెలలో విజిట్ చేసినప్పుడు సీఎం అమరేందర్ సింగ్ ప్రభుత్వంపై ఆయన విరుచుకపడ్డారు. ప్రజలను ఈ ప్రభుత్వం ఛీట్ చేస్తోందని ఆరో[పించారు. మీకు స్మార్ట్ ఫోన్ లు ఇస్తామని, మీ రుణాలను మాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అలా జరిగిందా అని ఆయన మోగాలో జరిగిన కిసాన్ మహా సమ్మేళన్ లో రైతులనుద్దేశించి ప్రశ్నించారు. 2017 లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ 117 సీట్లకు గాను 20 స్థానాలను దక్కించుకుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral video: మెట్రో ట్రైన్‌లో కోతి.. ఎంత బుద్దిగా ప్ర‌యాణం చేసిందో మీరే చూడండి

10 Storey Building: మరో ఘనత సాధించిన డ్రాగన్ కంట్రీ.. కొన్ని గంటల్లోనే 10 అంతస్థుల భవన నిర్మాణం వీడియో వైరల్