దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో పూర్తయ్యాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ పాలన అందిస్తుండగా.. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని తెలిపింది. బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందనుకుంటున్న ఆప్.. నామామత్రపు సీట్లకే పరిమితమైతుందని చెప్పింది. కాగా.. అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి గుజరాత్ లో బీజేపీకి గట్టి పోటీదారుగా ఆప్ వ్యవహరించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ అంచనాలకు అందుకోలేదనే విషయం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్‌లలోనూ ఆప్ తక్కువ సీట్లకే పరిమితమవుతుందని తేల్చి చెప్పింది.
గుజరాత్‌లో ఆప్ 182 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకుంటుందని, ఇది కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో (38) కలిసి గెలుచుకునే సీట్ల సంఖ్య చాలా తక్కువ అని ఎగ్జిట్ పోల్స్ వెల్లించాయి. అయితే ఈ సర్వేలు పూర్తిగా తప్పని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ప్రజలు నిరూపిస్తారని, ఫలితాలు వెల్లడయ్యాక ఈ విషయాలు అందరికీ అర్థమవుతాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కౌంటింగ్ వరకు వేచి ఉండండి. నేను ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్‌పై విశ్వాసం ఉంచారని ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. ఇది ఫలితం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అధికారం మనదే..
– అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధినేత
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి