AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections: ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత నాణ్యమైన విద్య.. అరవింద్ కేజ్రీవాల్ హామీ

గుజరాత్ (Gujarat) లో ఎన్నికల వేడి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఏర్పడింది. పంజాబ్ లో ఘన విజయం సాధించిన ఆప్.. గుజరాత్ లోనూ పాగా వేయాలని చూస్తోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో తన సత్తా ఏంటో..

Gujarat Elections: ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత నాణ్యమైన విద్య.. అరవింద్ కేజ్రీవాల్ హామీ
Arvind Kejriwal
Ganesh Mudavath
| Edited By: Team Veegam|

Updated on: Aug 25, 2022 | 4:06 PM

Share

గుజరాత్ (Gujarat) లో ఎన్నికల వేడి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఏర్పడింది. పంజాబ్ లో ఘన విజయం సాధించిన ఆప్.. గుజరాత్ లోనూ పాగా వేయాలని చూస్తోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Aravind Kejrival) గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్‌ జిల్లా భుజ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆప్‌ను (AAP) అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీ తరహాలో నాణ్యమైన పాలనను అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత, నాణ్యమైన విద్యనందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న స్కూళ్లల్లో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి కొత్త పాఠశాలలను నిర్మిస్తామని వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆడిట్‌ నిర్వహిస్తామని, తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత ఇస్తామని హామీ ఇచ్చారు.

కాగా.. గుజరాత్ కు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ గుజరాత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ దఫా అధికారం తమదేనన్న ధీమాతో ఉండగా.. బీజేపీని ఎలాగైనా ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, ఆప్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటకం, ఇలా అన్ని రంగాల్లో గుజరాత్ దూసుకెళ్తోంది. భారత పశ్చిమ తీరం వెంబడి ఉన్న గుజరాత్ రాష్ట్రం సుమారు 1,600 కిమీ తీర ప్రాంతంతో దేశంలోనే అతి పొడవైన రాష్ట్రంగా ఉంది. విస్తీర్ణం ప్రకారం గుజరాత్ ఐదో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గుజరాత్ రాష్ట్రంలో 1 మే 1960న ఆవిర్భవించింది. గుజరాత్ రాజధాని నగరం గాంధీనగర్. అతిపెద్ద నగరం అహ్మదాబాద్. గుజరాత్ రాష్ట్ర అధికార భాష గుజరాతీ. గుజరాత్ శాసనసభలో 182 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 92 సీట్లు కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం