Arunachal Tunnel: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్‌.. కీలక దశకు బోర్డర్‌ సెక్యూరిటీ ప్రాజెక్ట్!

|

Jan 24, 2022 | 7:30 AM

అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్‌ పెట్టనుంది ఇండియా. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా అత్యంత వేగంగా బలగాలను తరలించే బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.

Arunachal Tunnel: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్‌.. కీలక దశకు బోర్డర్‌ సెక్యూరిటీ ప్రాజెక్ట్!
Arunachal Pradesh Sela Tunnel Project
Follow us on

Arunachal Pradesh’s Sela tunnel Project: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్‌ పెట్టనుంది ఇండియా. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా అత్యంత వేగంగా బలగాలను తరలించే బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఇది అందుబాటులోకి వస్తే డ్రాగన్‌ కంట్రీకి చుక్కలు చూపించడం ఖాయమంటోంది ఇండియన్ ఆర్మీ.

లడఖ్ నుంచి అరుణాచల్‌ వరకు, మొత్తం 3వేల 400 కిలోమీటర్లు, ఇదీ భారత్‌-చైనా మధ్య సరిహద్దు ప్రాంతం. రెండు దేశాల నడుమ స్పష్టమైన వాస్తవాధీన రేఖ ఉన్నా… ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధి బయటపెడుతూ చొరబాటుకు యత్నిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. లడఖ్‌ ఘర్షణ తర్వాత బోర్డర్‌ సెక్యూరిటీ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌పై మెయిన్‌ ఫోకస్ పెట్టిన భారత్‌ అత్యంత వేగంగా బలగాల తరలింపు కోసం అరుణాచల్‌లో టన్నెల్‌ నిర్మాణం చేపట్టింది. చైనా సరిహద్దులకు క్షణాల్లో చేరుకునేలా చేపట్టిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.

ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం ఉన్నప్పటికీ బలగాలను బోర్డర్‌కు తరలించేందుకు చేపట్టిన సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఇండియన్ ఆర్మీకి అతిపెద్ద లైఫ్‌ లైన్‌గా మారనుంది. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే బోర్డర్ ప్రాంతమైన తవాంగ్‌కు అతి తక్కువ టైమ్‌లోనే చేరుకోవచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయ్. 13వేల అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అతి పొడవైన సొరంగాల్లో ఇది ఒకటి. సెలా టన్నెల్‌గా పిలుస్తోన్న దీన్ని 700కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపనతో 2019లో చేపట్టిన పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్‌ నాటికి కంప్లీట్‌ చేసి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది కేంద్రం. డ్రాగన్ కంట్రీ చైనా కూడా బోర్డర్‌లో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్‌ కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. రెండేళ్లక్రితం భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతంలో అత్యంత కీలకమైన పాన్‌గాంగ్‌ సరస్సుపై జెట్‌ స్పీడ్‌తో బ్రిడ్జిని నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జ్ కంప్లీటైతే పాన్‌గాంగ్‌ సరస్సు దగ్గరకు అత్యంత వేగంగా బలగాలను తరలించనుంది డ్రాగన్ కంట్రీ.

Read Also… Pak-China: పాకిస్తాన్‌ – చైనా బంధానికి బీటలు.. పాక్‌ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా!