Elections 2024: అరుణాచల్-సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?

|

Mar 17, 2024 | 5:54 PM

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్‌సభతోపాటే జూన్‌ 4న చేపట్టనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే.. వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది.

Elections 2024: అరుణాచల్-సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?
Eci Chief Rajeev Kumar
Follow us on

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్‌సభతోపాటే జూన్‌ 4న చేపట్టనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే.. వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది. దీంతో జూన్ 4న బదులు.. జూన్ 2నే ఈ రాష్ట్రాల్లో కౌంటింగ్ చేపట్టి, మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే సిక్కిం,అరుణాచల్‌ రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపులో ఎలాంటి మార్పులు లేవని ఈసీ వెల్లడించింది.

60 అసెంబ్లీ సీట్లు ఉన్న న అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. బీజేపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఓ ఇండిపెండెంట్‌ మద్దతుతో అక్కడ అధికారంలో ఉన్నాయి. సరిహద్దు ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ఎన్నికల అంశాలుగా ఉన్నాయి. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనూ ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌కు షెడ్యూల్‌ విడుదలైంది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలు మరియు 60 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. రాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం జూన్ 2తో ముగియనుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అసెంబ్లీలో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందగా, జనతాదళ్ (యునైటెడ్) 7 సీట్లు, ఎన్‌పీపీ 5, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకున్నాయి. కాగా, పీపీఏ ఒక స్థానంలో గెలుపొందగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. బీజేపీ, సిక్కిం క్రాంతికారి మోర్చాలతో కూడిన ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. మహిళా సంక్షేమ పథకాలు, అవినీతే ప్రధాన ప్రచారాంశాలుగా ఉన్నాయి.

ఏప్రిల్ 19న సిక్కింలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఈ హిమాలయ రాష్ట్రంలో ఒక లోక్‌సభ స్థానం, 32 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల చేస్తామని, ఆ తర్వాత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ మార్చి 27, నామినేషన్ పత్రాల పరిశీలన మార్చి 28న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ అని కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)తో తలపడనుంది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌,ఒడిశా , అరుణాచల్‌ప్రదేశ్‌ , సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ గడువు కంటే ముందే ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాల్సి ఉండడంతో అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం ఎన్నికల షెడ్యూల్‌లో ఈసీ మార్పులు చేసింది. చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో గట్టి భద్రత మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…