ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. వాటిలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతగా లడఖ్ ఉండనున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశ అధీనంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో వైశాల్యపరంగా జమ్ముకశ్మీర్ మొదటిస్థానంలో నిలవనుంది. దాని తర్వాత స్థానంలో లడఖ్ ఉంటుంది.