ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ప్రవేశపెట్టిన జమ్ము కశ్మీర్ విభజన బిల్లుపై వాడివాడిగా చర్చలు జరిగాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలకు అమిత్ షా సమాధానం చెప్పారు. ఆర్టికల్ 370 వల్ల లోయలో సుమారు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్ యువత ఎక్కువగా ఉగ్రవాదం వైపు వెళ్లారు. 1990 నుంచి 2018 వరకు కాశ్మీర్‌లో 41,894 మంది యువత ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. లోయలోని యువతకు కూడా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.