Army recruitment exam paper leak: ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు.. పూర్తి వివరాలు

Army recruitment paper leaked: సాధారణ సిబ్బందిని నియమించుకునేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆర్మీ పరీక్షకు సంబంధించి పేపర్​ లీక్​ అయింది.

Army recruitment exam paper leak: ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు.. పూర్తి వివరాలు

Updated on: Feb 28, 2021 | 5:05 PM

Army recruitment paper leaked: సాధారణ సిబ్బందిని నియమించుకునేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆర్మీ పరీక్షకు సంబంధించి పేపర్​ లీక్​ అయింది. ఈ కారణంగా.. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఘటనకు సంబంధించి పూణేలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు  తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా నియామక ప్రక్రియలో అవినీతి, అక్రమ పద్ధతులను భారత సైన్యం సహించదని ఒక అధికారి తెలిపారు.

పూణేలోని స్థానిక పోలీసులతో కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేసి, శనివారం రాత్రి సైనికుల నియామకం (జనరల్ డ్యూటీ) కోసం  కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం సిద్ధం చేసిన ప్రశ్నపత్రం లీకేజ్ అయిందని గుర్తించినట్లు సదరు అధికారి తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, నియామక ప్రక్రియలో నిరంతర పారదర్శకత ఉండేలా చూడాలని పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆర్మీ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి పూణేలోని బారామతిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

Also Read:

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు

పెదకాకానిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. ఆ మహిళదే స్కెచ్