
మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలపై దాడికి ప్రయత్నించిన యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీ (UKNA) కి చెందిన నలుగురు టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మి మట్టుపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్‌లోని ఖన్పీ గ్రామంలో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీ చెందిన టెరరిస్టులు.. ఈ మధ్య ఓ గ్రామ పెద్దను హత్య చేసి గ్రామస్థులను బెదిరింపులకు గురిచేశారు. ఈ క్రమంలో వీరి అరాచకాలపై దృష్టి పెట్టిన అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ వారిని మట్టుపెట్టేందుకు ప్లాన్ వేసింది. ఈ మేరకు ఆపరేషన్ ‘ఖాన్‌పీ చేపట్టింది.
తాజాగా ఖన్పీ గ్రామంలో 17 మంది యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీ ఉగ్రవాదులు దాగి ఉన్నారని తెలుసుకున్న భద్రతా బలగాలు, అస్సాం రైఫిల్స్ వారికోసం చురాచంద్‌పూర్ – ఖాన్‌పీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కుకీ ఉగ్రవాదులపై మెరుపువేగంతో భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపింది.ఈ ఎన్‌కౌంటర్‌లో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీకి చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.