Army Chopper Crash Funeral: బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రి ఇక లేరన్న బాధను గుండెల్లోనే దిగమింగుకొని..ఎంతో ధైర్యంతో దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రి పార్థివ దేహానికి చివరిసారిగా కన్నీటితో ముద్దు పెట్టుకుంటున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఇక లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. భర్త చివరి గుర్తుగా మిగిలిన ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు లిడ్డర్ సతీమణి.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు సహాయక సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్. హర్యానా పంచకులకు చెందిన లిడ్డర్ గతంలో కశ్మీర్‌లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు. అలాగే చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజకిస్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు.
I am going to be 17. So he was with me for 17 years, we will go ahead with happy memories. It’s a national loss. My father was a hero, my best friend. Maybe it was destined and better things will come our way. He was my biggest motivator: Aashna Lidder, daughter of Brig LS Lidder pic.twitter.com/4BhT4GSwTj
— ANI (@ANI) December 10, 2021
Delhi | We must give him a good farewell, a smiling send-off, I am a soldier’s wife. It’s a big loss: Brig LS Lidder’s wife Geetika Lidder pic.twitter.com/QOHxuFtxtL
— ANI (@ANI) December 10, 2021
ఇవి కూడా చదవండి: CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..
Home Remedies: చమటతో శరీరం నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే చక్కటి పరిష్కారం..