ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రతిదీ ఇంటర్నెట్ ద్వారానే పొందుతున్నాం. మనం తినే ఆహారం నుంచి వేసుకునే బట్టలు మొదలు ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా ఒక్కటేమిటి సర్వం ఆన్లైన్ సేవల ద్వారానే పొందుతున్నాము. మనం స్టోర్ కి వెళ్ళటం మరిచిపోయి ప్లేస్టోర్ నుంచి ఆర్డర్లు చేస్తున్నాము. ప్రపంచం మొత్తం మీద పోలిస్తే ఆన్లైన్ సేవలను వినియోగించడంలో భారతదేశం చాలా ఫాస్ట్ గా ఉంది. ఇది గుర్తించిన ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా నినాదం తో దాదాపుగా తన అన్ని సేవలను ఆప్ బేస్ ద్వారానే అందిస్తోంది. డిజిటల్ పేమెంట్ ని ప్రపంచం మొత్తం మీద భారతీయుల ఎక్కువగా యూస్ చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి పొందే సర్వీసులకి ప్రత్యేకమైన ఆప్ లను డిజైన్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసిన టీ ఫోలియో వంటి ఆప్ లలో చాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సేవలను ఆన్లైన్లో యాప్ లో అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ఆధార్ సేవలను ఆన్లైన్లో పొందటం. ఆధార్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాల్సిన ఐడెంటిటీ. అయితే చాలామందికి ఆన్లైన్లో ఆధార్ సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఆధార్ తీసుకుని వారు డైరెక్టుగా వెళ్లకుండా ఫోన్ లోనే ఆధార్ ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
మీరు డైరెక్ట్ గా వెళ్లి ఫిజికల్ గా ఆధార్ అప్లై చేసుకునే ఓపిక లేకుంటే ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ అనే ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ సిక్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. దానిలో అప్లై ఫర్ ద ఫస్ట్ టైం అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆప్షన్స్ లో మీకు సంబంధించిన జిల్లా.. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ని మెన్షన్ చేయాలి. డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్ కచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇలా ఏదో ఒకటి ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఆప్షన్ లో రిలేటివ్ నేమ్ ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారికి కచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి. ఆ ఓటర్ ఐడి మీద ఒక ఎపిక్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఉంటున్న ఇంటి అడ్రస్ ని దాంతో పాటు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కింద రెంటల్ అగ్రిమెంట్… పాస్పోర్ట్ లేదంటే గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిక్ కనెక్షన్ డాక్యుమెంట్లను ప్రొవైడ్ చేయవచ్చు. ఆ తర్వాత ఆ అడ్రస్ లో మనం ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాము పొందుపరచాల్సి ఉంటుంది.
దీంతో ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తయినట్టు. ఓకే కొట్టే ముందు ఒకసారి ప్రివ్యూ మొత్తం చూసుకోవచ్చు. మీరు నింపిన కాలమ్స్ సరిగా ఉన్నాయా లేవా చెక్ చేసి కన్ఫామ్ చేసుకున్నాక… కన్ఫామ్ అని క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మీకు కన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి పది రోజుల్లో మీ ఇంటి అడ్రస్ కి పోస్ట్ ద్వారా ఆధార్ చేరుతుంది.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిజైన్ చేయబడి నిర్వహిస్తున్న ఈ యాప్ లో పొందుపరిచిన వివరాలు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు 100% ప్రైవసీ కలిగి ఉంటాయి అని గుర్తుంచుకోండి ధైర్యంగా మీ వివరాలను ఇవ్వండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..