Apple Watch Series 7 : స్మార్ట్‌ ఫోన్లు.. టీవీలే కాదు.. వాచ్‌లు కూడా పేలుతాయ్‌ జాగ్రత్త.. ఆపిల్ వాచ్ సిరీస్ 7 పేలింది..

|

Oct 07, 2022 | 11:25 AM

Apple Watch Series 7 : బ్యాటరీలతో పనిచేసే గాడ్జెట్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో పేలుడు సంభవించిన సంఘటనలు చాలా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లే కాదు.. స్మార్ట్‌వాచ్‌లు కూడా పేలుతున్నాయి జాగ్రత్త.. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అయితే, ఇప్పుడు ఐఫోన్ తయారీదారు ఆపిల్ యొక్క స్మార్ట్ వాచ్ కూడా పేలింది.. అనే వార్తలు కలకలం […]

Apple Watch Series 7 : స్మార్ట్‌ ఫోన్లు.. టీవీలే కాదు.. వాచ్‌లు కూడా పేలుతాయ్‌ జాగ్రత్త.. ఆపిల్ వాచ్ సిరీస్ 7 పేలింది..
Smart Watch
Follow us on

Apple Watch Series 7 : బ్యాటరీలతో పనిచేసే గాడ్జెట్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో పేలుడు సంభవించిన సంఘటనలు చాలా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లే కాదు.. స్మార్ట్‌వాచ్‌లు కూడా పేలుతున్నాయి జాగ్రత్త.. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అయితే, ఇప్పుడు ఐఫోన్ తయారీదారు ఆపిల్ యొక్క స్మార్ట్ వాచ్ కూడా పేలింది.. అనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

యాపిల్ వాచ్ బ్యాటరీ మొదట వేడెక్కిందని, ఆపై అది పేలిపోయిందని వినియోగదారు ఆరోపించారు.. వినియోగదారుడు గడియారాన్ని కిటికీలోంచి బయటకు విసిరేయడంతో వాచ్ పేలిపోయింది. అయితే మీడియా కథనాల ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. నివేదిక ప్రకారం, ఇంతకుముందు ఆపిల్ వాచ్ అధిక ఉష్ణోగ్రత హెచ్చరికలను ఇస్తోంది. వాచ్ వెనుక సైట్‌లో కూడా క్రాక్ వచ్చింది. దీని తర్వాత వినియోగదారు Apple సపోర్ట్‌కి తెలియజేశారు. ఆపిల్ సపోర్ట్ తరపున స్మార్ట్‌వాచ్‌ను తాకకుండా దూరంగా ఉంచాడు వినియోగదారు. ఆ మరుసటి రోజు మళ్ళీ వాచ్ వేగంగా వేడెక్కింది. దాని నుండి పగిలిన శబ్దం రావడం ప్రారంభమైంది. దాంతో వెంటనే వినియోగదారు వాచ్‌ను కిటికీ నుండి బయటకు విసిరివేయటంతో వాచ్ పేలిపోయింది. ఆ తర్వాత ఆపిల్ సపోర్ట్‌ను సంప్రదించి పరిస్థితి గురించి వివరించాడు సదరు బాధితుడు. కంపెనీ చివరికి డివైజ్ పికప్‌ కోసం ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఆపిల్ ప్రొడక్టు లేదా స్మార్ట్ డివైజ్ పేలడం లేదా పగిలిపోవడం ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈ సమాచారాన్ని పబ్లిక్ చేయడానికి కంపెనీ నిరాకరించిందని సదరు వినియోగదారు ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..