
Buggana Rajendranath: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన రెవెన్యూ లోటు పూరించాలని కోరినట్లు ఆయన అన్నారు. ముందే కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, అందుకే రావాల్సిన నిధులపై చర్చ జరిగిందని బుగ్గన చెప్పారు. అలాగే పోలవరంపై గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరి చేస్తున్నామని, పోలవరంపై చంద్రబాబు నాయుడు తప్పుడు ఒప్పందాలు చేశారని ఆరోపించారు.
ఇక ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు కరోనా వారియర్స్ విజయమన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా..? ఎన్నికలు ముఖ్యమా..? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 14,21కి విరుద్దంగా ఎన్నికల షెడ్యూల్ ఉందని అన్నారు.
Farmers’ Protest : ఈ నెల 15న మరోసారి రైతుసంఘాలతో చర్చలు జరుపుతామన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి..