పుల్వామా తరహా దాడి జరగొచ్చు..బహుశా యుధ్ధం కూడా.. .. ఇమ్రాన్ ఖాన్

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. రేసిస్ట్ ఐడియాలజీ ప్రకారం బీజేపీ నడుస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. మంగళవారం తమ దేశ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆర్టికల్ 370 రద్దు మరో పుల్వామా దాడి వంటిదానికి, ఆ తరువాత యుధ్ధానికి దారి తీయవచ్చునన్నారు. గతంలో జరిగిన పుల్వామా ఎటాక్ కు, తమ దేశానికి సంబంధం లేదన్నారు. పుల్వామా వంటి దాడి చివరకు యుధ్ధానికే దారి […]

పుల్వామా తరహా దాడి జరగొచ్చు..బహుశా యుధ్ధం కూడా.. .. ఇమ్రాన్ ఖాన్
Follow us

|

Updated on: Aug 07, 2019 | 1:26 PM

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. రేసిస్ట్ ఐడియాలజీ ప్రకారం బీజేపీ నడుస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. మంగళవారం తమ దేశ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆర్టికల్ 370 రద్దు మరో పుల్వామా దాడి వంటిదానికి, ఆ తరువాత యుధ్ధానికి దారి తీయవచ్చునన్నారు. గతంలో జరిగిన పుల్వామా ఎటాక్ కు, తమ దేశానికి సంబంధం లేదన్నారు. పుల్వామా వంటి దాడి చివరకు యుధ్ధానికే దారి తీయవచ్చు..

అయితే ఆ యుధ్ధం లో ఎవరూ విజయం సాధించరు. కానీ గ్లోబల్ గా దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రపంచ నాయకులను కలిసి కాశ్మీర్ లోని పరిస్థితులను వివరిస్తుందని ఆయన చెప్పారు. శాంతి కోసం తాము చేసిన యత్నాలపట్ల భారత్ సానుకూలంగా స్పందించలేదని, అందుకే శాంతి చర్చల ప్రతిపాదనను విరమించుకున్నామని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ ప్రజలను అణచివేయజాలదన్నారు. ముస్లిములను రెండో తరగతి పౌరులుగా చూడాలన్నది బీజేపీ సిధ్ధాంతకర్తల ఐడియాలజీ.. మహమ్మద్ అలీ జిన్నా ప్రవచించిన రెండు దేశాల థియరీని మోదీ సర్కార్ ప్రతిబింబించినట్టు కనిపిస్తోంది. ఇండియా అన్నది కేవలం హిందువులకేనని, ముస్లిములను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా పరిగణించాలన్న ఆర్ ఎస్ ఎస్ వైఖరి గురించి జిన్నాకు తెలుసు… అని ఆయన వ్యాఖ్యానించారు.