కశ్మీర్‌లో రియల్ ఎస్టేట్.. వైరల్ అవుతున్న మెసేజ్

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం కూడా పొందింది. రాజ్యసభలో అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి కూడా గెజిట్ విడుదల చేశారు. అయితే అదే సమయంలో ఓ ఎస్సెమ్మెస్ వైరల్ గా మారింది. కశ్మీర్ లో రియల్ ఎస్టేట్.. త్వరపడండి అంటూ వచ్చిన ఓ మెసెజ్ సంచలనం రేపింది. “బుక్ యువర్ ల్యాండ్ అట్ కశ్మీర్ లాల్ చౌక్ […]

కశ్మీర్‌లో రియల్ ఎస్టేట్.. వైరల్ అవుతున్న మెసేజ్
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:45 PM

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం కూడా పొందింది. రాజ్యసభలో అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి కూడా గెజిట్ విడుదల చేశారు. అయితే అదే సమయంలో ఓ ఎస్సెమ్మెస్ వైరల్ గా మారింది. కశ్మీర్ లో రియల్ ఎస్టేట్.. త్వరపడండి అంటూ వచ్చిన ఓ మెసెజ్ సంచలనం రేపింది. “బుక్ యువర్ ల్యాండ్ అట్ కశ్మీర్ లాల్ చౌక్ రోడ్..” అన్న ఈ మెసేజ్‌లో భూముల ధరలను కూడా నిర్ధేశించారు. కేవలం రూ.11.25 లక్షలేనని, అది కూడా జీఎస్టీ కలిపి అని ఆ సందేశంలో పెట్టారు. ఆర్టికల్ 370 తొలగించారని.. అందువల్లో ఆస్తులను కొనుక్కోవాలంటూ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఓ మొబైల్ నంబర్ కూడా అందులో జోడించారు.

దీంతో అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఫోన్ నంబర్ కోల్‌కతాకు చెందిన ఈడెన్ రియాలిటీ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినది. కాగా తమకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చేసరికి.. స్పందించిన ఆ సంస్థ ఆ మెసేజ్‌ను తాము పెట్టలేదని, ఇది ఎవరో కావాలనే చేశారని వివరణ ఇచ్చింది. అంతేకాదు.. ఈ విషయంపై కోల్‌కతా సైబర్ క్రైం సెల్‌కు కూడా ఫిర్యాదు చేశామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దుతో.. ఇప్పుడు అక్కడ రియల్ వ్యాపారం ప్రారంభమవుతున్న సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest Articles
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్