
మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో ఇటీవల చిరుత పులుల తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య అక్కడి చిరుతల మరణాలు మాత్రం ఆగడం లేదు. రెండు రోజుల క్రితం మగ చీతా అయిన తేజస్ మృతి చెందింది. అయితే తాజాగా ఇప్పుడుస సురజ్ అనే మరో చిరుత మృత్యువాతపడింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే 4 నెలల్లోనే ఈ కూనో నేషసన్ పార్కులో ఇప్పటివరకు ఎనిమిది చిరుతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
మరో విషయం ఏంటంటే తాజాగా సూరజ్ చిరుత ఎలా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. ఆ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఒకటైన తేజస్ అనే మగ చిరుత మంగళవారం మృతి చెందింది. అయితే ఈ చిరుత మెడపై గాయాలున్నాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ చితాలో భాగంగా కేంద్రం రెండో దఫాల్లో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి 20 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.