
ఇది కదా మ్యాచ్ అంటే..! ఇలాంటి ఆటనే కదా అభిమానులు కోరుకునేది..! 41 ఏళ్ల తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడిన టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది. చివరి బంతి వరకు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెడుతూ సాగిన ఫైనల్‌లో భారత ఆటగాళ్లు.. జూలు విదిలించారు. ఊహించిన దానికంటే ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో తెలుగోడు తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అదిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఫైనల్లో పాక్‌ను భారత్ మట్టికరిపించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. ‘‘మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్ట్ చేశారు మోదీ.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత ఆటగాళ్ళకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ గెలిచినందుకు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్‌లో జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆటలో దాని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో టీమిండియా కీర్తిని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
My heartiest congratulations to Team India for winning the Asia Cup cricket tournament. The team did not lose any match in the tournament, marking its dominance in the game. I wish Team India sustained glory in the future.
— President of India (@rashtrapatibhvn) September 28, 2025
ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా టీమ్ ఇండియాకు అభినందనలు తెలుపుతు పోస్టులు పెట్టారు. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో తెలంగాణ రాష్ట్రాని కి గొప్ప పేరు, గౌరవం తెచ్చారని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు.. అద్భుతమైన టీం వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ మీద విజయం సాధించి దేశం గర్వించేలా చేశారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Heartiest congratulations to Team India on their emphatic victory over Pakistan and for lifting the Asia Cup! Your determination, teamwork and spirit have made the nation proud. A glorious moment for Indian cricket! 🇮🇳#TeamIndia #AsiaCupFinal #indvspak2025 pic.twitter.com/8Y8LmjrG9q
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2025
ఈ గెలుపుతో భారత్ ఆసియా కప్ చరిత్రలో తొమ్మిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఒకే టోర్నీలో మూడుసార్లు తలపడగా, మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. తిలక్ వర్మ ధైర్యవంతమైన ఇన్నింగ్స్, కుల్దీప్ స్పిన్ మాయా ఈ ఫైనల్‌ను ప్రత్యేకంగా మార్చాయి.
బయటచిత్రీకరించి అమెరికాలో రిలీజ్ చేసే చిత్రాలపై 100 శాతం సుఖం
భారతీయ చిత్రాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ బెరంపార్క్ రూమ్స్ వైపు నీరు చేరుతోంది. మరోవైపు వరద ఉధృతిపైటూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. పర్యాటక శాఖ బోట్లను డ్రైవర్లు తాళ్లతో కట్టేశారు. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా హార్రర్ కామెడీ రాజా సాబ్ ట్రైలర్ విడుదలైంది. చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ లుక్‌లో ప్రభాస్ కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 3.30 నిమిషాల ట్రైలర్ అంతా అభిమానులను దృష్టిలో పెట్టుకుని కట్ చేసారు మారుతి. సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మున్సిపల్ స్టేడియంలో భారీ స్థాయిలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మైదానంలో 66.5 అడుగుల ఎత్తయిన బతుకమ్మను అధికారులు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, ఆడిపాడుతున్నారు. మహిళా మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై బతుకమ్మ ఆడారు. పదివేలమంది మహిళలతో బతుకమ్మ ఆడి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్
రాజమండ్రి జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి
71 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి
మూసీ వరద ప్రవాహానికి దెబ్బతిన్న చాదర్‌ఘాట్ బ్రిడ్జ్
బ్రిడ్జ్‌పై రాకపోకలు నిలిపివేసిన అధికారులు
కోఠి నుంచి మలక్‌పేట్ వెళ్లేందుకు ఇబ్బందులు
చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ వద్ద ఆటో, కారు ఢీ
అక్కడికక్కడే ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
గాయపడిన వారికి హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు
స్వర్ణరథంపై మాడ వీధుల్లో మలయప్పస్వామి ఊరేగింపు
తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విహారం
స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు
మూలా నక్షత్రం సందర్భంగా పట్టువస్త్రాల సమర్ఫణ
ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
ఐదుగురిని అరెస్ట్ చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు
హార్డ్ డిస్కులు, సీక్రెట్ కెమెరాలు స్వాధీనం
కిరణ్ కస్టడీలో బయటపడ్డ పైరసీ ముఠా బాగోతం
దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు
శాటిలైట్ కంటెంట్ ఐటీ, పాస్‌వర్డ్‌లను క్రాక్ చేస్తున్న ముఠా
సినిమా రిలీజ్ కాకముందే సర్వర్లు హ్యాక్ చేసి వీడియోలను గేమింగ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ముఠా
సెన్సెక్స్ 61, నిఫ్టీ 20 పాయింట్ల నష్టం
లోకేష్‌కు క్యాప్ గిఫ్ట్‌గా ఇచ్చిన తిలక్ వర్మ
ఇండియా రాగానే నేరుగా తీసుకుంటానంటూ లోకేష్ ట్వీట్
మధ్యాహ్నం 1.30 గం.లకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం
సాయంత్రం 5 గం.లకు సీఐఐ సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ప్రపంచవ్యాప్తంగా రూ.252+ కోట్లు కలెక్ట్ చేసినట్టు చింత్ర బృందం వెల్లడి
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా
బెయిల్ మంజూరు చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
వారంలో రెండు సార్లు విచారణకు హాజరుకావాలని ఆదేశం
రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశం
నేటి నుంచి అక్టోబర్ 6 వరకు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విదిస్తూ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ ఎన్నికల నగారా మోగింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్కికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.-మొత్తం గ్రామ పంచాయితీలు 12,733లకు గానూ 1,12, 288 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినీ ప్రకటించారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు.
అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు
నేడు సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే దిశగా 10వేల మందితో బతుకమ్మ వేడుక
సాయంత్రం 4గంటలకు బతుకమ్మ వేడుకలు ప్రారంభం
హాజరుకానున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క
నేడు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వర్షసూచన
అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు…
అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అంతర్వేదిలో 500 మీటర్లు వెనక్కి వెళ్లి తీరమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది సముద్రం. సముద్రం నిర్మానుష్యంగా మారి 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం స్నానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు, భక్తులు భయపడిపోతున్నారు. మునుపెన్నడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదంటున్నారు. సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నా గ్రామస్తులు. ఎడారిని తలపించే విధంగా సముద్రం విశాలంగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో ఉన్నారు స్థానికులు.
తమిళనాడు కరూరు ఘటనపై విచారణ కొనసాగుతోంది. రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాథమిక విచారణ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ విచారణ చేపట్టింది. రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనపై కుట్ర కోణం అనుమానాలు ఉన్నాయి. సిబిఐ విచారణ కోరుతూ టీవీకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు టీవీకే పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. మీటింగ్ పాయింట్ వద్ద పవర్ ఆఫ్, లాఠీ ఛార్జ్ చేయడం వల్లే తోపులాట జరిగిందని ఆ పార్టీ ఆరోపించింది. అయితే TVK ఆరోపణలకు పోలీసులు వివరణ ఇచ్చారు. ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని పోలీసులు.. విజయ్ మీటింగ్ పాయింట్ కు వచ్చాక ఎలాంటి పవర్ ఆఫ్ లేదని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. మరో వైపు టీవీకే చీఫ్ విజయ్ సభలకు అనుమతి ఇవ్వొదని కన్నన్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పరుగులు పెడుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 44.2 అడుగులు చేరుకుంది. దిగువకు 9లక్షల 84 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్ట దగ్గర నీరు చేరుకోవడంతో భక్తులు గోదావరిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలనక్షత్రం వేళ మహా గౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. నిర్మల్ జిల్లా: శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూల నక్షత్రం వేల అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. సరస్వతి అమ్మవారి దగ్గర అక్షర శ్రీకర పూజలు చేయించడానికి అర్ధరాత్రి నుండి క్యూలైన్‌లో నిల్చోని ఉన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఉదయం 3 గంటల నుండి అక్షర శ్రీకర పూజలు నిర్వహిస్తున్నారు. 8వ రోజు మహా గౌరీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న జ్ఞాన సరస్వతి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది.
శరన్నవరాత్రుల్లో ఏడో రోజు మూలా నక్షత్రం రోజున, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఈ రోజు జగన్మాతను సరస్వతీ దేవి రూపంలో పూజిస్తారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. దుర్గమ్మ దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు.. భారీ బందోబస్తు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఎగువ కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి. నదుల్లో వరద ప్రవాహాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రిజర్వాయర్, చెరువు నింపాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తుందని అధికారులు వివరించారు. ప్రకాశం బ్యారేజ్ కు 7 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత క్రికెట్ జట్టు విజయంపై అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి సోషల్ మీడియా వేదికగా “మైదానం ఏదైనా, భారతదేశం ఎల్లప్పుడూ గెలుస్తుంది.. భారత క్రికెట్ జట్టులోని ప్రతి ఆటగాడికి హృదయపూర్వక అభినందనలు! జై హింద్” అని రాశారు. సీఎం యోగితో పాటు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య జట్టును అభినందించారు. “జై భారత్ – భారతదేశానికి విజయం! 2025 ఆసియా కప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు! పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయం సాధించడం ద్వారా, మీరు మొత్తం దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఈ అద్భుతమైన విజయం పట్ల మన దేశ ప్రజలందరూ ఎంతో గర్వపడుతున్నారు.”
ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా దుమార్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి ఆదివారం భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా దళాలపైకి కాల్పులు ప్రారంభించారు. ఈ వెంటనే భద్రతా దళాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ముందుకు వెళ్లాయి. ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నాయి.