AP CM YS Jagan Meets Union Ministers in Delhi tour: దేశ రాజధాని ఢిల్లీ టూర్‌లో రెండు రోజూ బిజీబిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర వికేంద్రీకరణ, ప్రాజెక్ట్‌లు, విభజన హామీలతో పాటు పలు అంశాలపై ఏపీ సీఎం జగన్ నిన్న పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీకి చేరిన ఆయన.. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు కేంద్ర పెట్రోలియం అండ్ స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి. ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కోరారు. వాటిపైనే ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ ఉన్నారు.
అనంతరం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Read Also….. Covaxin USFDA Rejects: భారత్ బయోటెక్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ.. కోవాగ్జిన్ వినియోగానికి ఎఫ్‌డీఏ నిరాకరణ!