
కర్నాటకలో గదగ్ జిల్లా లక్కుండి గ్రామంలో ఇంటి కోసం పునాది తీస్తుండగా గుప్త నిధి బయటపడడం తీవ్ర సంచలనం రేపింది. గంగవ్వ బసవరాజ్ రిత్తి ఇంటి స్థలంలో నిధి దొరికింది. శతాబ్ధాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకెబిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న అందుకున్న వెంటనే అదనపు జిల్లా కలెక్టర్ దుర్గేష్, ఎస్పీ రోహన్ జగదీశ్, ఏసీ గంగప్ప, తహసీల్దార్ శ్రీనివాస్ కులకర్ణి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పురవాస్తుశాఖ అధికారులు కూడా అక్కడికి వచ్చి నిధిని పరిశీలించారు. లభ్యమైన బంగారు ఆభరణాలు ఏ కాలానికి చెందినవో అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
లక్కుండిలో లభ్యమైన నిధిని స్థానిక వినాయకుడి గుడిలో భద్రపర్చారు. ఆలయం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గంగవ్వ బసవరాజ్ ఇంట్లో లభించిన గుప్తనిధిని చూడడానికి వందల సంఖ్యలో జనం అక్కడికి తరలించారు. లంకెబిందె లభించిన చోటును అధికారులు మార్కింగ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..