పహల్గామ్ ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన.. ముగ్గురిలో ఒకరి ఆచూకీ చెప్పినా రూ.20లక్షలు!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులపై జమ్మూకాశ్మీర్, అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. పోలీసులు విడుదల చేసిన ఊహా చిత్రాల్లోని ఉగ్రవాదులు ఆదిల్ హుస్సనే థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసాల వివరాలు తెలియజేసినా, వారి అరెస్ట్‌కు సహాయపడే సమాచారం ఇచ్చినా రూ.20లక్షలు ఇస్తామని ప్రకటనలో తెలిపారు.

పహల్గామ్ ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన.. ముగ్గురిలో ఒకరి ఆచూకీ చెప్పినా రూ.20లక్షలు!
Reward For Pahalgam Terrorist

Updated on: Apr 24, 2025 | 5:00 PM

Reward For Pahalgam Terrorists: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులను కాల్చి చంపిన ముష్కరులు.. దాడి తర్వాత అడవుల్లోకి పారిపోయినట్టు అనుమానించిన భద్రతా బలగాలు.. వారిని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు.మొత్తం ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు. వీరిలో ఇద్దరిని పాకిస్థాన్ పౌరులుగా గుర్తించారు. వీరందరికీ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని.. వీరి పేర్లు ఆదిల్ హుస్సనే థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసాలు అని పేర్కొన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కనిపించినా, వారిని గురించి తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని అనంత్ నాగ్ పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు సహాయం చేసినా.. వారి అరెస్టుకు సహాపడే సమాచారం ఇచ్చినా రూ.20లక్షల ఇస్తామని అనంతనాగ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఉగ్రవాదుల వివరాలు తెలిస్తే సమాచారం ఇచ్చేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అనంత్‌నాగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) కాంటాక్ట్ నంబర్‌లను కూడా ప్రకటనలో ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…