Anand Mahindra: ఇచ్చిన మాట తప్పని ఆనంద్‌ మహీంద్రా..! ప్రజ్ఞానందకు చేరిన ఎలక్ట్రిక్ కారు.. నెట్టింట ప్రశంసల వెల్లువ

భారతదేశానికి చెందిన 18 ఏళ్ల R ప్రజ్ఞానంద్ చెస్ ప్రపంచ కప్‌లో 32 ఏళ్ల నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఒడించి..ఎంతో మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రజ్ఞానంద్ ఆటతీరును ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. కొడుకు వృద్ధికి కారణమైన అతని తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇస్తానని గతంలో ప్రకటించారు. ఎట్టకేలకు

Anand Mahindra: ఇచ్చిన మాట తప్పని ఆనంద్‌ మహీంద్రా..! ప్రజ్ఞానందకు చేరిన ఎలక్ట్రిక్ కారు.. నెట్టింట ప్రశంసల వెల్లువ
Anand Mahindra Gifts Electric Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 13, 2024 | 1:01 PM

భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వివిధ రంగాలలో చురుకుగా ఉంటారు. ఆనంద్ మహీంద్రా తరచుగా సోషల్ మీడియాలో తన పోస్ట్‌ల ద్వారా తమాషా, ఫన్నీ వీడియోలు, చాలా స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటారు. అలా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలాగే, ఆనంద్ మహీంద్రా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి థార్ వంటి వారి ప్రత్యేక కార్లను బహుమతిగా అందజేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఒక చెస్ ప్లేయర్ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చాడు.

భారతదేశానికి చెందిన 18 ఏళ్ల R ప్రజ్ఞానంద్ చెస్ ప్రపంచ కప్‌లో 32 ఏళ్ల నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఒడించి..ఎంతో మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రజ్ఞానంద్ ఆటతీరును ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. కొడుకు వృద్ధికి కారణమైన అతని తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇస్తానని గతంలో ప్రకటించారు. ఎట్టకేలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. ప్రజ్ఞానంద ఫ్యామిలీ ఫిబ్రవరి 12న మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ400 ఈవీ (XUV400 EV) డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రజ్ఞానంద స్వయంగా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫోటోలో షోరూమ్ సిబ్బంది ప్రజ్ఞానంద్, అతని కుటుంబ సభ్యులకు ఆనంద్ మహీంద్రా బహుమతిగా ఇచ్చిన కారును బహుకరిస్తూ కనిపించారు. ఈ క్షణం ప్రజ్ఞానంద్ , అతని కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేక క్షణం గురించి వ్యక్తపరుస్తూ ప్రజ్ఞానంద్ ఇలా వ్రాశాడు, “XUV 400ని పొందడంతో నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆనంద్ మహీంద్రా సార్ @anandmahindra” మీకు మా ధన్యవాదాలు అంటూ ప్రజ్ఞానంద్ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌ను చూసిన చాలా మంది నెటిజన్లు ఆనంద్ మహీంద్రాను ప్రశంసించారు. ప్రజ్ఞానంద్, అతని కుటుంబాన్ని అభినందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..