Bengaluru blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కీలక అప్‌డేట్.. అతను అరెస్ట్

మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ బృందం బళ్లారిలో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిని అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఇతను బాంబు పెట్టినట్లు భావిస్తోన్న వ్యక్తితో కాంటాక్ట్ అయినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.

Bengaluru blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కీలక అప్‌డేట్.. అతను అరెస్ట్
Rameshwaram Cafe
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2024 | 12:54 PM

బళ్లారిలోని బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బళ్లారికి చెందిన షబ్బీర్‌ను తెల్లవారుజామున 4 గంటలకు ఎన్‌ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం తదుపరి విచారణ నిమిత్తం బెంగళూరుకు తీసుకొచ్చారు. రామేశ్వరం బాంబు కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న షబ్బీర్‌ తొరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. మార్చి 1వ తేదీ ఉదయం 9:10 గంటలకు బుడా కాంప్లెక్స్ సమీపంలో అనుమానిత ఉగ్రవాదిని షబ్బీర్‌ కలిశాడు. అనుమానితుడితో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడినట్లు సమాచారం. ఈ అనుమానాలతోనే ఎన్‌ఐఏ అధికారులు షబ్బీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

షబ్బీర్ నేపథ్యంపై ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. బాంబు పేలుడు అనుమానితుడు.. తన అన్నయ్య పిల్లల ద్వారా పరిచయమయినట్లు షబ్బీర్ తెలిపినట్లు సమాచారం. షబ్బీర్ అతని వివరాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. బాంబు పెట్టిన వ్యక్తి… బళ్లారి కొత్త బస్ స్టేషన్ నుంచి బుడా కాంప్లెక్స్‌కు ఆటోలో వచ్చి షబ్బీర్ కలిసినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ ఇటీవల కీలక ప్రకటన చేసింది.  బాంబు పెట్టాడని భావిస్తున్న అనుమానిత వ్యక్తి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లేదా హైదరాబాద్‌లో తలదాచుకున్నాడని, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…